Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Kiara Advani: హీరోతో కియారా అద్వానీ పెళ్లి డేట్ ఫిక్స్, ఆ ప్యాలెస్ లో భద్రతల మధ్య వివాహం!
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడిగా భరత్ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా అనిపించుకుంటుంది. ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు దాదాపుగా మంచి విజయం సాధించాయి. అయితే ఇటీవల కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా వీళ్ల పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని మరో వార్త షికారు చేస్తోంది.

రామ్ చరణ్ తో కలిసి..
తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

హాటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా..
వినయ విధేయ రామ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసిన ఈ మూవీ అంతగా హిట్ సాధించలేదు. దీంతో బాలీవుడ్ వైపుకు పయనించింది ఈ బ్యూటి. అక్కడ అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు సాధించింది. ఇటీవల గోవిందా మేరా నామ్ సినిమాతో నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో హీరో విక్కీ కౌశల్ కు హాటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా అలరించింది. అలాగే తెలుగులో మళ్లీ రామ్ చరణ్ సరసన RC15 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

షేర్షా సినిమాతో మొదలు
..
ఇదిలా ఉంటే కియారా అద్వానీ నటించిన అనేక హిందీ చిత్రాల్లో షేర్షా ఒకటి. ఆర్మీ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని హీరోనే సిద్ధార్థ్ మల్హోత్ర. ఈ మూవీ సమయం నుంచే కియారా, సిద్ధార్థ్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియాకు అనేక సార్లు చిక్కారు. దీంతో సిద్ధార్థ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లు డేటింగ్ లో ఉన్నారు అని త్వరలో పెళ్లికూడా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని ఇదివరకే చాలాసార్లు బాలీవుడ్ మీడియాలో టాక్ అయితే వచ్చింది.

బ్రేకప్ వార్తలు కూడా..
అయితే గత ఏడాది నుంచి కూడా సిద్ధార్థ్ మల్రోత్రా, కియారా అద్వానికి జంటకు సంబంధించిన పెళ్లి వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మధ్యలో వీరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు అని కూడా ఒక టాక్ వినిపించింది. అసలైతే ఒకానొక సమయంలో సిద్దార్థ్ మల్హోత్రా తాను ఎవరిని ప్రేమించడం లేదు అని కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.

కుటుంబాల మధ్య చర్చలు..
సిద్ధార్థ్ అలా చెప్పినప్పటికీ ఈ జంట రిలేషన్ షిప్ వార్తలు ఆగలేదు. ఓ ప్రైవేట్ పార్టీలలో అలాగే కొన్ని స్పెషల్ వెకేషన్ లో కనిపిస్తూ ఉండడంతో డేటింగ్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అసలైతే ఈ ఏడాదిలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అని అందుకోసం కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని మరొక కొత్త టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు కియారా-సిద్ధార్థ్ పెళ్లి డేట్, వేదిక ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరిలో పెళ్లి..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలుస్తున్న కియారా-సిద్ధార్థ్ ల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న జరగనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఫిబ్రవరి 4 నుంచే ప్రీ వెడ్డింగ్ పనులు జరగనున్నాయట. ఫిబ్రవరి 4, 5 తేదిలలో హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక వీరి పెళ్లి వేడకకు రాజస్థాన్ లోని జైసల్మీర్ ప్యాలెస్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కట్టుదిట్టమైన భద్రత..
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి జరగనుందట. అలాగే ప్యాలెస్ చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారట. అందుకోసం ఫిబ్రవరి 3వ తేదినే బాడీగార్డ్స్ చేరుకోనున్నారట. అయితే త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.