Amitabh Bachchan కు లవ్ ప్రపోజ్ చేసిన కుర్ర హీరోయిన్.. మోకాళ్లపై కూర్చొని క్రేజీగా
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో నిరాటకంగా సాగుతున్నది. మెదడుకు మేత పెట్టడమే కాకుండా మేధస్సును అందజేస్తున్న ఈ షోకు మంచి రేటింగ్ కూడా నమోదు అవుతున్నది. అయితే ప్రతీ వారాంతంలో సెలబ్రిటీలతో ఆడించే ఆట మరింత ఆసక్తిగా కొనసాగుతున్నది. వచ్చే వారం హమ్ దో హమారే దో చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లు కృతి సనన్, రాజ్‌కుమార్ రావు కేబీసీలో పాల్గొన్నారు. అమితాబ్‌తో కృతిసనన్ అల్లరిగా, కొంటెగా వ్యవహరించినట్టు సమాచారం. అయితే అమితాబ్‌కు లవ్ ప్రపోజ్ చేయడం ఆసక్తిగా మారింది.
కేబీసీ 13 సీజన్‌కు సంబంధించి సోని టెలివిజన్ 19 నిమిషాల ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో అమితాబ్ బచ్చన్ ముందు మోకాళ్లపై నిలబడి ప్రేమను వ్యక్తం చేయడం వైరల్‌గా మారింది. కీర్తి సనన్ నటించిన లుకా చప్పీ సినిమాలోని దునియా పాట బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా మోకాళ్లపై కూర్చొని ఆమె ప్రేమను వ్యక్తం చేసింది. ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి స్టెప్పులు వేసింది.

కేబీసీ షోలో భాగంగా అమితాబ్‌తో రాజ్ కుమార్ రావు పోటా పోటీగా డైలాగ్స్ చెబుతూ.. నా వద్ద డబ్బు, బంగళా ఉంది.. అమ్మ ఉంది అంటూ దీవార్ చిత్రంలో అమితాబ్ కొట్టిన డైలాగ్స్ చెబితే.. నా వద్ద కృతి సనన్ ఉంది అంటూ బిగ్ బీ షాకిచ్చారు.
అమితాబ్‌తో కలిసి రాజ్ కుమార్ రావు, కృతి సనన్ ఆడిన కేబీసీ గేమ్‌కు సంబంధించిన ఎపిసోడ్ అక్టోబర్ 29వ రోజున ప్రసారం కానున్నది. తాజా ప్రోమో ఎపిసోడ్‌పై అంచనాలు పెంచింది.
ఇక హమ్ దో హమారే దో చిత్రంతోపాటు కృతి సనన్ బచ్చన్ పాండే, గణపత్, భేడియా, షెహజాదా చిత్రాల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మేడే చిత్రంతోపాటు బ్రహ్మస్త్ర, ప్రాజెక్ట్ కే, ది ఇంటర్న్, గుడ్ బై, ఉంచాయి చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











