For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్: ఆ పెళ్లికాని హీరోయిన్‌కు మూడేళ్ల కూతురు, ఇంతకాలం రహస్యంగా...

|

పెళ్లయితే హీరోయిన్ల కెరీర్ దాదాపుగా ముగిసినట్లే! వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన కథానాయికలతో సినిమాలు చేయడానికి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపరు. ఒక వేళ చేసినా... రొమాంటిక్ సీన్లు లేని కథలు, మహిళా ప్రధానమైన కథలకు మాత్రమే వారిని ఎంచుకుంటారు. ఫాంలో ఉన్న హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం కూడా ఇదే అని చెబుతుంటారు.

కొందరు హీరోయిన్లు తమకు పెళ్లయినా.... ఆ విషయాలను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించిన సందర్భాలు అనేకం. ఈ మధ్య పెళ్లి జోలికి వెళ్లకండా సహజీవనం చేసే కల్చర్ కూడా ఇండస్ట్రీలో బాగా పెరిగిపోయింది. పెళ్లి చేసుకోకుండానే బిడ్డను కనడం లాంటివి ఇపుడు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి మహి గిల్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మడేళ్ల కూతురు ఉందని చెప్పి షాకిచ్చింది

2008లో వచ్చిన ‘డేవ్ డి' అనే సినిమా ద్వారా పాపులర్ అయిన మహి గిల్...తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను మూడేళ్ల కూతురుకు తల్లిని అనే విషయం బయట పెట్టారు. తన పర్సనల్ లైఫ్ విషయాలను గోప్యంగా ఉంచే ఈ బ్యూటీ...ఈ విషయం బయట పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అలాంటి వ్యక్తికి మూడేళ్ల కూతురు ఉందనే విషయం షాక్‌కు గురి చేసింది.

ఇంకా పెళ్లి కాలేదు, తల్లి కావడం గర్వంగా ఉంది

తాజాగా ఆమె ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘నాకు మూడేళ్ల కూతురు ఉంది అనే విషయం చెప్పడానికి గర్వపడుతున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నపుడు చేసుకుంటాను. ఈ ఆగస్టులో నా బిడ్డకు మూడేళ్లు నిండుతాయి' అని మహి గిల్ తెలిపారు.

నేను సింగిల్ కాదు, నాకంటూ ఒకడు ఉన్నాడు

అయితే ఇంతకాలం బిడ్డ ఉన్న విషయం ఎందుకు బయట పెట్టలేదు అనే ప్రశ్నకు మహి గిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు తనను ఎవరూ ఈ ప్రశ్న అడగలేదని, అందుకే తాను కూడా చెప్పలేదని తెలిపారు. నేను సింగిల్ కాదని, నా జీవితలో ఒక వ్యక్తి ఉన్నాడని మహి గిల్ స్పష్టం చేశారు.

పెళ్లి అవసరం ఏముంది? చేసుకోవాలా.. వద్దా అనేది వ్యక్తిగతం

మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అనే ప్రశ్నకు ఆమె రియాక్ట్ అవుతూ... ‘పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగతం. పెళ్లి చేసుకోకుండానే పిల్లలు, ఫ్యామిలీ పొందవచ్చు. అది ఒక సమస్యగా నేను భావించను. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారికంటూ కొన్న సూత్రాలు ఉంటాయి' అని తెలిపారు.

పెళ్లి చాలా అందమైనది

పెళ్లిపై నమ్మకం లేదు అని నేను అనడం లేదు. పెళ్లి అనేది ఒక అందమైన ఈవెంట్. అది అవసరమా? లేదా? అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందని మహి గిల్ తెలిపారు. ఆమె సినిమాల విషయానికొస్తే 43 ఏళ్ల మహి గిల్ త్వరలో ‘ఫ్యామిలీ ఆఫ్ ఠాకూర్ గంజ్' మూవీలో కనిపించబోతోంది. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శుభ్రా శుక్లా, జిమ్మీ షెర్గిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జులై 19న విడుదల కాబోతోంది.

English summary
In an interview with Navbharat Times, Mahie Gill revealed that this August her daughter will turn three. "I am very proud that I am the mother of a daughter. Yes, I have not been married yet, when I want to marry, I will do it. In August this year, my child will be three years old," said the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more