నేను ఫైటర్‌ను.. నన్ను ఏదీ ఆపలేదు.. మలైకా అరోరా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ ముద్దు గుమ్మ మలైకా అరోరా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నది. రోడ్డు ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకొని ప్రస్తుతం గాయాలతో హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నది. ఈ క్రమంలో వైద్యులు, కుటుంబ సభ్యుల ఆదరణ, ప్రేమ గురించి తన సుదీర్ఘమైన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. మలైకా అరోరా రాసిన ఎమోషనల్ పోస్టులో ఏమున్నదంటే..
ఇటీవల ముంబైకి సమీపంలోని పన్వేల్‌లో మలైకా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చేతిలో కారు అదుపు తప్పడంతో రాజ్ థాక్రే మీటింగ్‌కు వెళ్తున్న ముగ్గురు మహా నిర్మాణ్ సేన సమితి కార్యకర్తలను ఢీకొట్టింది. దాంతో వారికి గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయాలు అవ్వడం తెలిసిందే. దాంతో గాయాలైన వారిని నవీ ముంబైలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనపై మలైకా ఎమోషనల్‌గా స్పందిస్తూ..
గత కొద్ది రోజులుగా నా జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు చూస్తే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. రోడ్డు ప్రమాదం గురించి ఊహించుకొంటేనే నిజంగా జరిగిందా అనే అనుమానం కలుగుతున్నది. కారు ప్రమాదం తర్వాత నా స్టాఫ్, కుటుంబ సభ్యులు స్పందించిన తీరుతో నేను బతికి బయటపడ్డానని అనిపిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ నా వెంట ఉండి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. నన్ను బతికించడానికి వైద్యులు చేసిన కృష్టి, నేను కోలుకోవడానికి వైద్య సిబ్బంది చేస్తున్న సేవల వల్లే నేను త్వరగా కోలుకొంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నాపై ప్రేమ కురిపిస్తున్న వారికి నా ధన్యవాదాలు అని మలైకా అరోరా తన లేఖలో పేర్కొన్నారు.

నా జీవితంలో నాకు జరిగిన రోడ్డు ప్రమాదం గానీ.. మరో సంఘటన గానీ.. నేను ధైర్యంగా నిలబడి పోరాడుతాను. నేను నిజంగా ఫైటర్‌ను. అందుకే మీకు ఒకే మాట చెబుతున్నాను. నేను త్వరలోనే మరింత పటిష్టంగా మీ ముందుకు వస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు అని మలైకా స్పష్టం చేసింది.
మలైకా అరోరా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు స్పందించారు. మలైకాకు నుదుటిపై స్వల్ప గాయాలు అయ్యాయి. సీటీ స్కాన్ తీయగా ఎలాంటి భారీ గాయాలు లేవనే విషయం స్పష్టమైంది. ఆమె ప్రస్తుతం కోలుకొంటున్నది. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేస్తాం అని అపోలో హాస్పిటల్ వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు.


Click it and Unblock the Notifications











