స్విమ్‌సూట్ కాకపోతే.. చీరకట్టుకోవాలా? దారుణమైన కామెంట్లపై మలైకా

By Rajababu

Recommended Video

Malaika Arora Bikini Pictures Goes Viral

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చిన తర్వాత తారల వ్యక్తిగత జీవితం బహిరంగమైపోయింది. సినీ తారలు తమ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేసుకోవడం సాధారణమైపోయింది. ఆ విషయంలో కొన్నిసార్లు సినీ నటులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. తాజాగా అలాంటి చేదు అనుభవం బాలీవుడ్ ఐటెం గర్ల్ మలైకా అరోరాకు ఎదురైంది. గతంలో స్విమ్‌సూట్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వాటిపై కొందరు నెటిజన్లు అడ్డదిట్టంగా కామెంట్లు వదిలారు.

 హాట్ హాట్‌గా స్విమ్ డ్రెస్‌లో

హాట్ హాట్‌గా స్విమ్ డ్రెస్‌లో

మాల్దీవుల పర్యటనలో భాగంగా స్విమ్‌సూట్‌లో హాట్‌ హాట్‌గా కనిపిస్తున్న ఫొటోలపై కొందరు స్పందిస్తూ ఘాటైన కామెంట్లు వదిలారు. సెక్సీగా, హాట్‌గా ఉన్నావని, సముద్రంలో చేపలా ఉన్నావని కొందరు కామెంట్లు చేశారు. కొందరైతే హద్దు మీరు దారుణమైన కామెంట్లు వదిలారు.

 ట్రోల్స్‌ను పట్టించుకోను

ట్రోల్స్‌ను పట్టించుకోను

సోషల్ మీడియాలో తన ఫొటోలపై మలైకా అరోరా స్పందిస్తూ.. నేను ట్రోల్స్‌ను పెద్దగా స్పందించను. పట్టించుకోకపోవడమే దానికి తగిన పరిష్కారం. ట్రోల్స్ వల్ల తన గురించి ఏమని అనుకొంటారో తెలుస్తుంది అని మలైకా పేర్కొన్నారు.

 స్విమ్మింగ్ సూట్‌లో కాకుండా

స్విమ్మింగ్ సూట్‌లో కాకుండా

సముద్ర తీరాన సేద తీరేటప్పుడు స్విమ్మింగ్ సూట్‌లో కనిపించకుంటే చీరలో కనిపిస్తారా? సముద్రతీరాన నీటిలో ఇతర సంబంధిత కార్యక్రమాల్లో పాలుపంచుకొనేటప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా స్విమ్‌సూట్లే ధరిస్తారు. అలా కాకుండా మరే దుస్తులేమైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. వాటిపై దృష్టిపెడుతా అని మలైకా చెప్పింది.

 దంబాంగ్3లో మలైకా

దంబాంగ్3లో మలైకా

ప్రస్తుతం దంబాగ్3 చిత్రంలో మరోసారి మున్నీగా ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు సిద్దమవుతున్నారు. అలాగే ఇండియాస్ నెక్ట్స్ టాప్ మోడల్ మూడో సీజన్‌లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. గతంలో గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన కెవ్వుకేక అంటూ మలైకా చేసిన ఐటెం సాంగ్ విశేష ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X