కేన్స్: బోనులో బంధీగా మల్లికా షెరావత్, మైనర్లతో వ్యభిచారంపై....

By Bojja Kumar

Recommended Video

Mallika Sharawath At Cannes Festival

మల్లికా షెరావత్... ఒకప్పుడు తన గ్లామర్‌తో, సెక్సీ పెర్పార్మెన్స్, ముద్దు సీన్లతో ఇండియన్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన బ్యూటీ. సినిమాల్లో నటించడం తగ్గించిన తర్వాత చాలా రేర్‌గా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఈ హాట్ లేడీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇక్కడ ఆమె బోనులో బంధీగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా అని ఆమెను ఎవరూ బంధించలేదు. బాలికల సంరక్షణ అనే అంశంపై 'ఫ్రీ గర్ల్‌' అనే ఎన్జీవో తరఫున కేన్స్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మల్లికా ఇలా తనను తాను బంధించుకుంది.

పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నారు

పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నారు

‘నాకు కేన్స్‌లో ఇది తొమ్మిదో ఏడాది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మైనర్ బాలికలపై అకృత్యాలు జరుగుతున్నాయి. వారిని బంధీలుగా చేసి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సమస్య గురించి ప్రపంచానికి చాటడానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక మంచి వేదిక అని మల్లికా షెరావత్ తెలిపారు.

ఎలాంటి సహాయం లేకుడా దుర్భరంగా

ఎలాంటి సహాయం లేకుడా దుర్భరంగా

నన్ను నేను ఇలా బోనులో బంధించుకోవడం ద్వారా... ఇదే విధంగా ఎందరో బాలికలను వాహనాల్లో తరలిస్తున్నప్పుడు వారు పడే బాధను ఊహించగలుగుతున్నాను. ఆ అమాయక చిన్నారులు ఎలాంటి సాయం లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు అని మల్లికా షెరావత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి నిమిషానికి ఒక ఘోరం

ప్రతి నిమిషానికి ఒక ఘోరం

ఈ ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక మహిళపై ఘోరం జరుగుతోంది. వారి జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకం లేకుండా బ్రుతుకుతున్నారు. అందుకే అలాంటి వారి కోసం నా వంతు ఏదన్నా సాయం చేయాలనుకున్నాను, అందుకే ఈ అవేర్‌నెస్ కాంపెయిన్ నిర్వమిస్తున్నాను అని మల్లికా షెరావత్ తెలిపారు.

మల్లికా కేన్స్ రెడ్ కార్పెట్ షో...

మల్లికా కేన్స్ రెడ్ కార్పెట్ షో...

ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో తన అందాల హొయలు ఒలికిస్తూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద సందడి చేసింది మల్లికా షెరావత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X