Just In
- 6 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 18 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 38 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రియాను రాక్షసిలా మార్చారు, నేను తనకే సపోర్ట్ చేస్తా.. సుశాంత్ మృతిపై మంచు లక్ష్మి, తాప్సి కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా మంచు లక్ష్మి ఆమెకు మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది. సుశాంత్ సూసైడ్ కి ముందు వరకు సినిమా ఇండస్ట్రీలో రియాతో చాలా మంది సెలబ్రెటీలు క్లోజ్ గా ఉండేవారు కానీ ఎప్పుడైతే సుశాంత్ మరణించాడో అప్పటి నుంచి రియాకు ధూరంగా ఉంటున్నారు.

మంచు లక్ష్మీ సపోర్ట్
గత రెండు నెలల నుంచి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అనేక రకాల అనుమానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అతని ప్రేయసి రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ మరణానికి అసలు కారణం అని సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఎట్టకేలకు మంచు లక్ష్మి తనదైన శైలిలో సపోర్ట్ అందిస్తూ న్యాయం జరగాలని కామెంట్ చేసింది.

స్పందించాలా వద్దా అని చాలా ఆలోచించాను.
సుశాంత్ కి న్యాయం జరగాలని అలాగే మరోవైపు రియాకు కూడా న్యాయం జరగాలని మంచు లక్ష్మి వివరణ ఇవ్వడం వైరల్ గా మారుతోంది. ఆమె ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'రీసెంట్ గా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేసాయ్ రియా చక్రవర్తిని ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన అనంతరం నేను స్పందించాలా వద్దా అని చాలా ఆలోచించాను.

ఆ అమ్మాయిని ఒక రాక్షసిలా..
ఈ విషయం గురించి చాలా ఆలోచించాను. నేను ఎవరినైనా సరే ముందు సైలెంట్ గా గమనిస్తాను. ప్రస్తుత మీడియా ద్వారా ఒక అమ్మాయి రాక్షసురాలిగా కనిపిస్తోంది. నిజమేంటో నాకు తెలియదు, అదే విధంగా నేను అసలు నిజాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం ఎలాగైనా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను.

నిజాలు తెలియకుండా..
అదే విధంగా న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సుశాంత్‌కు న్యాయం చేయాలని అన్ని రకాల ఏజెన్సీలు అధికారులు కష్టపడుతున్న విధానంపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. నిజాలు తెలుసుకోకుండా ఒకరిని కించపరచడం కరెక్ట్ కాదు. ఇక వారి కుటుంబ సభ్యుల గురించి కూడా నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం భావ్యం కాదు.

ఆ బాధను ఊహించగలను
మీడియా వలన వారి కుటుంబం అనుభవిస్తున్న బాధను నేను ఉహించగలను. జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడు మన సహచరులు కూడా నా కోసం నిలబడాలని నేను భావిస్తాను. ఈ విషయంలో నిజం తెలిసేవరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో ఒక సహా నటిగా మద్దతు ఇస్తున్నాను' అంటూ మంచు లక్ష్మి వివరణ ఇవ్వడం వైరల్ అవుతోంది.

తాప్సి కామెంట్..
అలాగే తాప్సి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ న్యాయం రుజువుకాక ముందే ఒకరిపై నిందను మోపడం భావ్యం కాదని తెలిపింది. 'నాకు సుశాంత్ వ్యక్తిగత పెద్దగా తెలియదు అలాగే రియా గురించి కూడా నాకు తెలియదు. కాని నాకు ఒకటి తెలుసు, నేరాన్ని నిరూపించని వ్యక్తిని దోషిగా తేల్చడానికి న్యాయవ్యవస్థను అధిగమించడం చాలా తప్పు. న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చట్టాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించాలని కోరుకుంటున్నా' అని తాప్సి తెలిపింది.