twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో తెలుసుకో.. కంగనాకు ఉప ముఖ్యమంత్రి చురక

    |

    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. కంగనా గురించి తెలిసిన వారెవ్వరూ ఆమెతో పెట్టుకోరు. ఆమెతో వాగ్వాదానికి దిగి గెలవడం మామూలు విషయం కాదు. బాలీవుడ్‌ను, వారసత్వాన్ని, బంధుప్రీతికి వ్యతిరేకంగా గళమెత్తే కంగనా.. పెద్ద పెద్ద స్టార్స్‌ను ఏకిపారేస్తుంది. బాలీవుడ్ క్వీన్‌గా మారిన కంగనా.. నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కంగనా.. సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు మాత్రం విమర్శల పాలవుతుంటాయి.

    పంగా ట్రైలర్ ఈవెంట్..

    పంగా ట్రైలర్ ఈవెంట్..

    కంగనా ప్రస్తుతం పంగా అనే చిత్రంలో నటిస్తోంది. మహిళ, గృహిణి, తల్లిగా ఎన్ని కష్టాలుంటాయి.. అన్నింటిని దాటుకుని జాతీయ స్థాయిలో కబడ్డీ ప్లేయర్‌గా ఎదగాలన్న తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందన్న కథతో పంగా అనే చిత్రం రాబోతోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో కంగనా అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేసే ఈ ఈవెంట్‌లో కంగనా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

     కేవలం 3,4 శాతం మాత్రమే..

    కేవలం 3,4 శాతం మాత్రమే..

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనల్ని ఉద్దేశించి కంగన మాట్లాడింది. ‘ఆందోళన హింసాత్మకంగా ఉండకూడదు. మన దేశంలో కేవలం 3-4 శాంత మంది జనాభా మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. మిగిలిన వ్యక్తులు వీరిపైన ఆధారపడుతున్నారు. కాబట్టి బస్సుల్ని, రైళ్లని దగ్ధం చేసి... దేశంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించే హక్కు ఎవరిచ్చారు?. ఓ బస్సు ధర రూ.80 లక్షల వరకు ఉంటుంది. అది తక్కువ మొత్తం కాదు' అని కాస్త ఘాటుగానే విమర్శించింది.

    కౌంటర్ వేసిన ఉపముఖ్యమంత్రి

    ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కంగన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు . హింస, ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయడం తప్పు, అది చట్టవిరుద్ధమే.. కానీ ఈ దేశం 3 శాతం మంది ప్రజల పన్నుపై ఆధారపడడం లేదని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరు పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నాడు.

    ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారు..

    ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారు..

    పేదవాడి నుంచి ధనికుడి వరకు అందరూ ఏదో ఒక రూపంలో పన్ను కడుతున్నారని అన్నాడు. కూలి పని చేసేవారు కూడా పరోక్షంగా పన్నులు చెల్లిస్తున్నారని తెలిపాడు. ఉప్పులాంటి చౌక వస్తువులు కొన్నా.. వాటిపై ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఓ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినా నటీనటుల కోసం కొంత, వినోదపు పన్ను రూపంలో మరికొంత చెల్లిస్తున్నాడని చురకలంటించాడు. ఇప్పుడు ఆలోచించు.. ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు.

    English summary
    Manish Sisodia Counter To Kangana Ranaut. Sisodia also slammed her reminding her of the contribution made by a daily wager, who contributes to her personal income. And yes Even a normal daily wage labourer… when going to the cinema… contributes to the coffers of the movie stars and even pays (entertainment) tax for this country. Now think who is dependent on whom.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X