రాజ్, కృష్ణ డీకే వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయ్
బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో దుమ్మురేపిన అతికొద్ది మంది నటుల్లో మనోజ్ బాజ్‌పేయ్ ఒకరు. సత్య, స్పెషల్ చబ్బీస్ (26), అలీగఢ్ చిత్రాలు ఆయన నట ప్రతిభకు అద్దంపట్టాయి. ప్రస్తుతం తొలిసారి వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టనున్నారు. నిర్మాత, దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ వెబ్ సిరీస్ సుమారు 10 ఎపిసోడ్స్ ఉంటుంది. రాజకీయ నేతల భరతం పట్టే పాత్రలో మనోజ్ బాజ్‌పేయ్ నటించనున్నారు. ఈ సందర్భంగా మనోజ్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ.. రాజ్, డీకేతో పనిచేయడం గొప్ప అనుభూతి. వారి సృజనాత్మక శక్తి అమోఘం. ఈ ఏడాది నాకు మంచి అవకాశాలు కల్పించినందుకు భగవంతుడికి రుణపడి ఉంటాను అని మనోజ్ బాజ్‌పేయ్ అన్నారు.

ఈ ఏడాది మనోజ్ బాజ్‌పేయ్ భోంస్లే, సన్ చిరియా, సత్య మేవ జయతే, లవ్ సోనియా, గలీ గలియోన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సత్యమేవ జయతేలో జాన్ అబ్రహంతో కలిసి నటిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











