సెక్సువల్ హారాస్మెంట్ కేసు కొట్టివేసిన కోర్టు... నటిపై పరువు నష్టం దావా!
పాకిస్థానీ సింగర్ అలీ జాఫర్‌పై నటి మీషా షఫి వేసిన సెక్సువల్ హరాస్మెంట్ కేసును లాహోర్ కోర్టు కొట్టపారేసింది. దీంతో అలీ జాఫర్ రివర్స్ ఎటాక్ ప్రారంభించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సదరు నటిపై పరువు నష్టం దావా వేశాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
'మీషా షఫి నా మీద వేసిన కేసు కొట్టివేయబడింది. నా మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమె మీద నేను వేసిన పరువు నష్టం కేసు నడుస్తోంది. కేవలం మీషా షఫి మీద మాత్రమే కాదు, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియలో కాంపెయిన్ చేసిన వారిపై కూడా కేసు పెట్టాను' అని అలీ జాఫర్ ట్వీట్ చేశారు.

అలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో 'లక్స్ స్టైల్ అవార్డ్స్ 2019' వేడుకకు ఇన్వైట్ చేయడాన్ని నిరసిస్తూ పలువురు సెలబ్రిటీలు వాకౌట్ చేశారు. కొందరు ఆర్టిస్టులైతే అవార్డ్స్ నామినేషన్స్ లిస్టు నుంచి తమ పేరును ఉపసంహరించుకున్నట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
జాఫర్ అలీ సంఘటన పాకిస్థాన్లో సంచలనం అయింది. అయితే ఈ కేసును కోర్టు కొట్టివేయడం, తిరిగి అతడు మీషాపై పరువు నష్టం దావా వేయడంతో కొత్తమలుపు తిరిగింది. అయితే ఈ విషయంలో చాలా మంది మిషాకు మద్దతుగా నిలవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











