Just In
- 55 min ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 1 hr ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 1 hr ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
- 2 hrs ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
Don't Miss!
- News
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Sports
ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్ అజామ్ తొలిసారి టాప్-10లోకి!
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మీటూ దెబ్బకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అవుట్.. మంత్రి జోక్యంతో వికెట్ పడింది ఇలా..
లైంగిక వేధింపులను వ్యతిరేకిస్తూ సాగుతున్న మీటూ ఉద్యమ ప్రభావంతో బాలీవుడ్‌లో మరో వికెట్ పడింది. కొద్దిరోజులుగా తనపై కొందరు సినీ తారలు, గాయనీమణులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనుమాలిక్ పాపులర్ షో ఇండియన్ ఐడల్ 11 నుంచి తప్పుకోవడం సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ చానెల్, వార్త సంస్థలు కూడా ధృవీకరించాయి. వివరాల్లోకి వెళితే..

అనుమాలిక్‌ను వెంటాడిన మీటూ
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనుమాలిక్‌కు తీవ్రమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన సింగర్లు సోనా మహాపాత్ర, నేహా బాసిన్, అలీషా చినాయ్, శ్వేతా పండిట్ లాంటి ఇటీవల కాలంలో ఆయనపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. అయితే తనపై వస్తున్న లైంగిక ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. అన్నీ తప్పుడు ఆరోపణలే అని అనుమాలిక్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

మంత్రి సృతి ఇరాని దృష్టికి
అనుమాలిక్ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా తీసుకోవడంపై సోనా మహాపాత్ర ఘాటుగా స్పందించారు. కొందరు మహిళలను తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగ పరిచినా.. సోని టీవీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకోవాలని సోనా పాత్ర ట్వీట్ చేశారు. ఎందరో మహిళలను చెప్పుకొన్న బాధను కేంద్ర మంత్రి కూడా చదువాలి అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
|
సోని టెలివిజన్‌కు నోటీసులు
అయితే పలువురు సింగర్లు చేసిన ఆరోపణలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. అనంతరం సోని టెలివిజన్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేశారు. దాంతో సోని టీవీ కూడా తీవ్రంగా పరిగణించింది. దాంతో సోని టెలివిజన్ నిర్వహించే ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమం నుంచి అనుమాలిక్ తప్పుకోవడం జరిగింది.

అను మాలిక్ జడ్జీగా తప్పుకోవడం..
సోని టెలివిజన్ నిర్వహించే ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమం నుంచి అనుమాలిక్ తప్పుకొన్నారు. ఇక నుంచి జడ్జీగా ఆయన వ్యవహరించబోరు అని సోని నిర్వాహకులు జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. పాపులర్ షో నుంచి ఆయన తప్పుకొన్నారనే వార్త నిజమే అని వారు ధృవీకరించారు. అయితే ఆయన స్థానంలో మరో సెలబ్రిటీ ఎవరనే విషయాన్ని ఇంకా గోప్యంగానే ఉంచడం గమనార్హం.