రాత్రికి వస్తావా? అప్పుడే.. అక్కడే అన్నీ అంటూ.. సినీ ప్రముఖుడితో యువ హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ నటి నీనా గుప్తా ఆత్మకథ స్పూర్తితో బాలీవుడ్ హీరోయిన్లందరూ తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ను బయటపెడుతున్నారు. ఇప్పటికే సుర్వీన్ చావ్లా వెల్లడించగా.. అదే దారిలో యువ హీరోయిన్ మినీషా లాంబా తన పెదవి విప్పారు. కోరిక తీర్చితే అవకాశాలు ఇస్తామనే సినీ పెద్దల గుట్టు విప్పుతూ మినిషా లాంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

సినిమా ఇండస్ట్రీలో వేధింపులు
సినిమా ఆఫర్ల వెనుక రకరకాల వేధింపులు ఉంటాయి. తెర మీద రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే చాలదు. చాలా విషయాలను సమర్ధవంతంగా డీల్ చేయాల్సి ఉంటుంది. కొందరు సినీ ప్రముఖులను డీల్ చేసే విధానం తెలియక కెరీర్, జీవితాన్ని నాశనం చేసుకొంటారు అని మినీషా లాంబా చెప్పారు.

మోసానికి గురికాకుడదు
సినీ పరిశ్రమలో రాణించాలంటే గొప్పగా నటించాల్సిన అవసరం కంటే.. వ్యక్తుల చేత ఎలా మోసానికి గురికావొద్దనే విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకొంటే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినట్టే. కానీ అన్ని సందర్బాల్లో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనడం మామూలు విషయం కాదు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు అంటూ మినిషా లాంబా చెప్పారు.

అన్ని ఇండస్ట్రీలో అలాంటి మగాళ్లు..
తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మినీషా లాంబా మాట్లాడుతూ.. ప్రతీ ఇండస్ట్రీలో మగాళ్లు ఉంటారు. కేవలం సినిమా పరిశ్రమలోనే అలాంటి వారుంటారని చెబితే తప్పు అవుతుంది. తమ కనుసన్నల్లలో పనిచేసే వారి కోసం కొందరు మగాళ్లు ట్రై చేస్తుంటారు. అలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలి అని మినిషా లాంబా చెప్పారు.

డిన్నర్‌కి కలుద్దా? అంటూ
మినీషా లాంబా ఒక సినీ ప్రముఖుడితో జరిగిన చేదు అనుభావాన్ని తెలియజేస్తూ.. ఓ సినిమా ఆఫర్ గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు.. మనం రాత్రి ఎందుకు కలువ కూడదు. డిన్నర్‌కి కలుద్దా? అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకొందాం అని అడిగారు.. అయితే అందుకు నాకు వీలుపడదు. మనం ఆఫీస్‌లో ఏదైనా సమయంలో కలుద్దాం. నేను ఫ్రీగా ఉన్నా డిన్నర్‌కు రాను. మీకు ఏదైనా మాట్లాడాలంటే రేపు ఆఫీస్‌లో ఏదోక టైమ్‌లో కలుద్దాం అని ముఖంపై చెప్పాను అని మినీషా లాంబా చెప్పారు.

మినీషా లాంబా కెరీర్ గురించి
మినీషా లాంబా కెరీర్ విషయానికి వస్తే... 2005లో యాహా అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బచ్నా ఏ హసీనో, బేజా ఫ్రై 2 తదితర చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2017లో భూమి అనే చిత్రంలో నటించారు. అలాగే బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్‌గా కనిపించారు. తెనాలి రామకృష్న, ఇంటర్నెట్ వాలా లవ్ లాంటి సీరియల్స్‌లో కూడా నటించారు.


Click it and Unblock the Notifications











