twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    500 జీన్స్ 5 వేలకు.. బీయింగ్ హ్యూమన్ వెనుక మనీలాండరింగ్.. సల్మాన్‌పై దంబంగ్ డైరెక్టర్ ఫైర్

    |

    ప్రేక్షకులు, అభిమానుల్లో ఉన్న తన క్రేజ్‌ను డబ్బుగా మార్చుకొనేందుకు సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే చారిటీని ఉపయోగించుకొంటున్నారని దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీయింగ్ హ్యూమన్ అనేది కేవలం పబ్లిసిటీ కోసమే అని విమర్శించారు. ఈ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలా వెనుక మనీలాండరింగ్ కుంభకోణం ఉందని ఆయన అన్నారు. సుశాంత్ మరణాంతరం సల్మాన్ ఖాన్‌పై అభినవ్ మాటల దాడిని, విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా అభినవ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

    బీయింగ్ హ్యుమన్ వెనుక స్వార్ధ ప్రయోజనాలు

    బీయింగ్ హ్యుమన్ వెనుక స్వార్ధ ప్రయోజనాలు


    బీయింగ్ హ్యుమన్ సంస్థ ఏర్పాటు వెనుక తండ్రి సలీంఖాన్ స్వార్ధ ప్రయోజనాలు ఉన్నాయి. తన కుమారుడిపై ఉన్న క్రిమినల్ కేసులు, గుండా ఇమేజ్‌ను తొలగించడానికి ఈ సంస్థను స్థాపించారు. ఛారిటీ మాటున చాలా మోసాలు జరుగుతున్నాయి. రూ.500 జీన్స్ ప్యాంట్‌ను రూ.5000 వేలకు అమ్ముతారు అని అభినవ్ కశ్యప్ అన్నారు.

    5 సైకిళ్లు పంచి 500 వందలు అని

    5 సైకిళ్లు పంచి 500 వందలు అని

    దంబంగ్ షూటింగ్ సమయంలో నేను కళ్లారా చూశాను. 5 సైకిళ్లు పంపిణీ చేశారు. మరుసటి రోజు పేదలకు సల్మాన్ ఖాన్ 500 సైకిళ్లు దానం చేశారనే వార్తను పేపర్లో పబ్లిష్ చేసుకొన్నారు. ఇదంతా మీడియాను, కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులను సంతృప్తి పరచడం కోసమే అని అభినవ్ కశ్యప్ ఆరోపించారు.

    అమాయకులను మోసం

    అమాయకులను మోసం

    ఛారిటీ పేరుతో సల్మాన్ ఖాన్ కుటుంబం అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నది. సాధారణ ప్రజలను, అమాయకులను మోసం చేస్తున్నది. అభిమానం అనే దానిని తమ స్వార్ధానికి ఉపయోగించుకొంటూ వారి కంట్లో దుమ్ము కొడుతున్నది. ప్రజలకు ఈ సంస్థ ద్వారా ఎలాంటి సహాయం చేయదు. ఈ సంస్థ వ్యవహారాలపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలి. అందుకు తన వంతు సహకారం అందిస్తానని అభినవ్ కశ్యప్ వెల్లడించారు.

    Recommended Video

    Sushant Singh Rajput's Asthi Visarjan (Ashes Immersion) అస్థికల నిమజ్జనం in Patna, VIDEO
    సల్మాన్‌పై పెరిగిన విమర్శల దాడులు

    సల్మాన్‌పై పెరిగిన విమర్శల దాడులు

    సుశాంత మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. హిందీ సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం వల్ల యువ హీరోలు, బయటి నుంచి వచ్చే ప్రతిభావంతులు వేధింపులకు గురి అవుతున్నారనే ఆరోపణలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో తన కెరీర్‌ను, తన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసేందుకు సల్మాన్ ఖాన్ కుటుంబం కుట్రలు చేసింది అని దర్శకుడు అభినవ్ కశ్యప్ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.

    English summary
    Dabangg director Abhinav Kashyap made serious allegations on Salman Khan Family. Dabangg director Abhinav Kashyap alleges Salman Khan with intense criticism. He revealed that money laundering is happening in the name of charity. He demands inquiry on Salman's Charity affairs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X