twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Money laundering case: రూ.200కోట్ల స్కామ్ లో జాక్వెలిన్ పేరు.. ఈడీ సమన్లు.. మరోసారి విచారణ

    |

    బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే జాక్వెలిన్ ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలతో ఎక్కువగా హైలెట్ అవుతోంది. అయితే ఇదివరకే ఈ బ్యూటీ తనపై వస్తున్న ఆరోపణలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఆమె వివరణ ఇచ్చిన కొన్ని రోజులకే మరోసారి ఈడీ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.

    విచారణకు జాక్వెలీన్

    విచారణకు జాక్వెలీన్

    కన్‌మన్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.అలాగే సెప్టెంబర్ 25 శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నటిని కోరారు. అందుకు జాక్వెలీన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఆమె తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.

    అప్పుడు సాక్షిగా..

    అప్పుడు సాక్షిగా..

    అంతకుముందు ఆగస్టు 30 న, సుకేశ్ చంద్రశేఖర్‌పై కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 5 గంటల పాటు విచారించింది. అక్కడితోనే ఆమె ఈ కేసు నుంచి బయటపడిందని అందరూ అనుకున్నారు. అయితే అప్పుడు ఈ కేసులో ఆమెను కేవలం నిందితురాలిగా కాకుండా సాక్షిగా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం.

    రూ .200 కోట్ల స్కామ్..

    రూ .200 కోట్ల స్కామ్..

    ఇక 2017 ఎలక్షన్ కమిషన్ (ఇసి) లంచం కేసులో అరెస్టయిన చంద్రశేఖర్ నుంచి చాలా మంది సెలబ్రెటీల పేర్లు వివిధ అంశాల నుంచి బయటకు వచ్చాయి. ఇక అలాంటి స్టార్ సెలబ్రెటీలలో వ్యక్తులలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా బయటకు వచ్చింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు రూ .200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్లు సదరు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక తీహార్ జైలు నుంచి కాలేకర్ ఐడి స్పూఫింగ్ ద్వారా చంద్రశేఖర్ జాక్వెలిన్‌ను సంప్రదించాడని ఆరోపణలు కూడా వచ్చాయి.

    సెలబ్రిటీలను టార్గెట్ చేసాడు

    సెలబ్రిటీలను టార్గెట్ చేసాడు

    అతను తన జైలు గది నుండి కాల్ స్పూఫింగ్ ద్వారా చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలను టార్గెట్ చేసాడు. అతనిపై 20 కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. చంద్రశేఖర్ సంపన్న వ్యక్తులను దోచుకోవడానికి ప్రధాన మంత్రి కార్యాలయం, సిబిఐ ప్రధాన కార్యాలయం నుండి సీనియర్ అధికారుల మొబైల్ ఫోన్ మరియు ల్యాండ్‌లైన్ నంబర్‌లను ఉపయోగించారని అధికారులు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. అతను కేంద్ర న్యాయ మంత్రి మరియు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తికి PA గా వ్యవహరించాడు.

    Recommended Video

    Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
     బంగ్లాలో ఖరీదైన కార్లు..

    బంగ్లాలో ఖరీదైన కార్లు..

    గత నెలలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెన్నైలోని సుకేష్ చంద్రశేఖర్ ఖరీదైన బంగ్లాపై దాడి చేసింది. బంగ్లా ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్‌లు మరియు ఖరీదైన ఫర్నిచర్‌తో డిజైన్ చేయబడిందని బాలీవుడ్ మీడియాలో కొన్ని విజువల్స్ వచ్చాయి. బంగ్లాను చూసుకోవడానికి, నిర్వహించడానికి అనేకమంది సేవకులు ఉన్నారు. అలాగే, బంగ్లా పార్కింగ్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెంట్లీ బెంటైగా, ఫెరారీ 458 ఇటాలియా, లంబోర్ఘిని ఉరుస్, ఎస్కలేడ్, మెర్సిడెస్ AMG 63, BMW, రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.

    English summary
    Money laundering case Jacqueline Fernandez asked to appear before ED
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X