Don't Miss!
- News
తెలంగాణ గవర్నర్ తమిళిసై మార్పు..?!
- Sports
INDvsAUS : ప్రాక్టీస్‌లో మా ఫోకస్ అంతా దానిపైనే: రాహుల్ ద్రావిడ్
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Besharam Song: ముదురుతున్న పఠాన్ 'బేషరమ్' సాంగ్ వివాదం.. ముస్లిం సంస్థ వార్నింగ్, షారుక్ ముఖ్యం కాదంటూ!
రోజురోజుకి షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం మరింత చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన బేషారమ్ రంగ్ సాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ పాటకు భారీగా స్పందన లభించినప్పటికీ అంతకు మించిన రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయం నుంచి మతాల వారీగా బేషారమ్ రంగ్ పాటను విమర్శిస్తున్నారు. ఇప్పటికే వీర్ శివాజీ గ్రూప్ పలు విమర్శలు చేయగా.. పఠాన్ సినిమాపై తాజాగా ముస్లీంలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే..

అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోక కీలక పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఇటీవల విడుదల చేశారు.

కాషాయం రంగు బికినీ..
షారుక్, దీపికల హాట్ నెస్ తో బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విమర్శల పాలవుతోంది. ఇటీవల దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సినిమా యూనిట్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సినిమా పాటలో కాషాయం రంగులో బికినీని ధరించి అవమానపరిచే విధంగా చేశారు అని నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సినిమాపై నిషేధం విధించాలి అని మరికొందరు నిరసన వ్యక్తం చేశారు.

దిష్టిబొమ్మలు దగ్ధం..
ఇక వీర్ శివాజీ గ్రూప్ కు సంబంధించిన కార్యకర్తలు అయితే ఇండోర్ లో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తూ దీపిక పదుకొణె, షారుక్ ఖాన్ లకు సంబంధించిన దిష్టిబొమ్మలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలోని పాటలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని అవి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి అని చెబుతూ వెంటనే ఈ సినిమాను అడ్డుకోవాలి అని కూడా వారు డిమాండ్ చేశారు.

ముస్లీం సంస్థ విమర్శలు..
ఇక ఇప్పుడు తాజాగా పఠాన్ సినిమా ఒక ముస్లిం సంస్థ కూడా విరుచుకుపడుతోంది. సినిమా టైటిల్ ను మార్చకపోయినా, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోయనా మూవీపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రధాన కార్యాలయమైన ఆల్ ఇండియా ముస్లిం తేవార్ కమిటీ డిమాండ్ చేసింది.

మనోభావాలను దెబ్బతీయడమే..
"గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా ముస్లిం నుంచి నాకు డజన్ల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, అలాగే ఇస్లాంను చెడుగా చూపుతున్నారని వారు చెప్పారు. అలాంటి చిత్రానికి పఠాన్ అని పేరు పెట్టడం పఠాన్ వంశం మనోభవాలను అవమానించడమే. దాని పేరు మార్చకపోతే సినిమాను నిషేధించాలని మేము కోరుతున్నాం" అని భోపాల్ కు చెందిన ముస్లిం ఔట్ ఫిట్ హెడ్ పీర్జాదా ఖుర్రం మియాన్ చిస్తీ పేర్కొన్నారు.

షారుక్ ఖాన్ కనిపించాడా లేదా అన్నది కాదు..
ముంబై, తెలంగాణలోని మా సంస్థకు చెందిన వారు త్వరలో సినిమాపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నిర్మాతలు, నటీనటులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. సినిమాలో SRK (షారుక్ ఖాన్) కనిపించాడా లేదా అనేది మాకు ముఖ్యం కాదు.. అభ్యంతరకరంగా అతను కనిపించే విధానం మారకపోతే సినిమాను బ్యాన్ చేయాలన్న మా డిమాండ్ మారదు అని AIMTC (ఆల్ ఇండియా ముస్లిం తేవార్ కమిటీ) హెడ్ తెలిపారు.