»   » వంద మంది ఉన్నారు, ఏది సెక్సువల్ హరాస్మెంట్?: తనుశ్రీ దత్తా ఆరోపణలపై నాానా పాటేకర్

వంద మంది ఉన్నారు, ఏది సెక్సువల్ హరాస్మెంట్?: తనుశ్రీ దత్తా ఆరోపణలపై నాానా పాటేకర్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nana Patekar Denies Taanushree Dutta's Comments

  బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై చేస్తున్న సెక్సెవల్ హరాస్మెంట్ ఆరోపణలపై నానా పాటేకర్ తొలిసారి స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆ సంఘటన జరిగిన సమయంలో ఉన్న సినిమా యూనిట్‌కు ఏం జరిగిందో తెలుసు, వారి సపోర్ట్ కూడా నాకు ఉంది, ఆమె చేసిన ఆరోపణలపై చట్టపరంగా ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  'అసలు సెక్సువల్ హరాస్మెంట్ అంటే అర్థం ఏమిటి? ఆ సమయంలో నాతో పాటు 50 నుండి 100 మంది యూనిట్ సభ్యులు ఉన్నారు, అలాంటపుడు ఆమె ఆరోపనలు చేస్తున్నట్లు అది సాధ్యమేనా? అని నానా పాటేకర్ వ్యాఖ్యానించారు. లీగల్‌గా నేను ఎలా ప్రొసీడ్ అవుతానో చూడండి, ఈ విషయమై మీతో(మీడియా) మాట్లాడటం దండగ, నేను ఏం మాట్లాడినా మీరు ఏదో ఒకటి రాస్తారు అన్నారు.

  నా పని నేను చేసుకుంటూ వెళతాను

  నా పని నేను చేసుకుంటూ వెళతాను

  నానా పాటేకర్ కొన్ని రోజులుగా పేద, కరువు ప్రభావిత రైతులకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ‘ఎవరు నాపై ఎలాంటి ఆరోపణలు చేసినా నేను చేసే పని చేసుకుంటూ వెళతాను' అని నానా పాటేకర్ అన్నారు.

  తనుశ్రీ దత్తా తీవ్ర ఆరోపణలు

  తనుశ్రీ దత్తా తీవ్ర ఆరోపణలు


  ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా #మీటూ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగ్‌లో నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై సెక్సువల్ హరాస్మెంటుకు పాల్పడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బలవంతంగా చేయి పట్టుకుని లాగుతూ నీకు డాన్స్ నేర్పిస్తాను అంటూ అసభ్యంగా తాకాడని ఆతనుశ్రీ ఆరోపించారు.

  ఆ పార్టీ మనుషులను పంపారు

  ఆ పార్టీ మనుషులను పంపారు

  తనను వేధించడమే కాకుండా అతడి అడ్వాన్సెస్ రిజస్ట్ చేసినందుకు.... రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనకు చెందిన మనుషులను పంపి బెదిరించారని, తన కారుపై దాడి చేయించారని తనుశ్రీ దత్తా ఆరోపించారు.

  నానా పాటేకర్‌కు మద్దతు

  నానా పాటేకర్‌కు మద్దతు

  అయితే తనుశ్రీ దత్తా ఆరోపణలను ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా యూనిట్ ఖండించింది. దర్శకుడు రాకేష్ సారంగ్, ఆ సమయంలో సెట్స్ లో ఉన్న నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య మాట్లాడుతూ నానా పాటేకర్ తప్పుగా ప్రవర్తించినట్లు తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.

  English summary
  Accused of sexual harassment by actress Tanushree Dutta, Nana Patekar remains defiant. In his first response to the allegations, Mr Patekar told Times Now that he is considering legal action and claimed support from the film unit present at the time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more