»   » బిగ్ షాక్: ఛత్రపతి నటుడి హఠాన్మరణం, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

బిగ్ షాక్: ఛత్రపతి నటుడి హఠాన్మరణం, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

Subscribe to Filmibeat Telugu
ఛత్రపతి నటుడి హఠాన్మరణం, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

హిందీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. ముంబైలోని నానేగావ్ సమీపంలో ఉన్న తన ఫాం హౌస్‌లో బుధవారం ఉదయం 5 గం.కు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో రెండుసార్లు గుండెపోటుకు గురైన నరేంద్ర ఝా.. కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం మూడోసారి గుండెపోటు రావడంతో ఆయన హఠాన్మరణం చెందారు.

 డ్రైవర్ ఏం చెప్పాడు?:

డ్రైవర్ ఏం చెప్పాడు?:

నరేంద్ర ఝా మృతికి సంబంధించి ఆయన డ్రైవర్ పలు వివరాలు వెల్లడించారు. 'ఆయనకేమి ఆరోగ్య సమస్యలు లేవు. మంగళవారం రాత్రి బాగానే ఉన్నారు. రాత్రి భోజనం చేశాక మాతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన బాగానే ఉన్నారు. తెల్లవారుజామున ఉదయం 4గం.కు ఆయనకు ఛాతీలో నొప్పి మొదలైంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది' అని డ్రైవర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు.

 నరేంద్ర ఝా ప్రొఫైల్

నరేంద్ర ఝా ప్రొఫైల్"

బీహార్ లోని మధుబణి ప్రాంతంలో జన్మించిన ఆయన.. టెలివిజన్ లోనూ, సినిమాల్లోనూ తనదైన ముద్రవేశారు. విశాల్ భరద్వాజ్ 'హైదర్', హృతిక్ రోషన్ 'కాబిల్' 'మొహెంజొదారో', షారుఖ్ ఖాన్ 'రాయిస్' వంటి చిత్రాల్లో నటించారు. సల్మాన్ ఖాన్ 'రేస్-3' సినిమాకు కూడా ఇటీవలే సైన్ చేశారు.

తెలుగులోనూ..:

తెలుగులోనూ..:

టెలివిజన్ కార్యక్రమాలతో తన సినీ కెరీర్ మొదలుపెట్టిన నరేంద్ర ఝా.. టీవి యాడ్స్ లలో మోడల్ గానూ నటించారు. తెలుగులో ఛత్రపతి, యమదొంగ, లెజెండ్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆయన హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోనూ సూద్,హృతిక్ రోషన్ సంతాపం..:

'ఇది చాలా విషాదకరం. నరేంద్ర ఝా చాలా మంచి వ్యక్తి. ఆయన లేరన్న వార్త నమ్మలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఆయనో అద్భుతమైన నటుడని, ఇది చాలా షాకింగ్ గా ఉందని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు.

మనోజ్ భాజ్‌పాయి:

‘ఇది పెద్ద షాకింగ్‌.. నరేంద్ర ఝా..? ఈ వృత్తి నిజంగా కిల్లర్ లాంటిది' అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. ఈ వార్తను నమ్మలేకపోతున్నానని, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనోజ్ భాజ్ పాయి ట్వీట్ చేశారు.

English summary
Actor Narendra Jha, who featured in films like Raees, Kaabil, Haider and Mohenjo Daro, died of heart attack on Wednesday morning, reports news agency IANS. He was 55.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu