Don't Miss!
- Automobiles
కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!
- Finance
ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Aryan khan: డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు.. అర్ధరాత్రి అమ్మాయిలతో రేవ్ పార్టీ.. రంగంలోకి ఎన్‌సిబి
అక్టోబర్ 2 న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో నిర్వహిస్తున్న ఒక రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడి చేసినట్లు తెలిసింది. అయితే ఈ క్రమంలో ఒక బాలీవుడ్ నటుడి కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఉదయం నేషనల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఆ బడా స్టార్ హీరో తనయుడు ఎవరు అనే వివరాల్లోకి వెళ్లగా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను NCB అధికారులు నిర్బంధించినట్లు వెల్లడైంది. ఈ వార్త నేషనల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
|
అర్ధరాత్రి పార్టీలో..
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై డ్రగ్ బస్ట్ కేసులో కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లోనే అతన్ని పలు ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌పై అధికారులు దాడి చేసిన తర్వాత శనివారం రాత్రి జరిగిన పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని అలాగే మరికొందరిని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది.

కేసు నమోదు చేయలేదు..
అయితే ఆర్యన్ ఖాన్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇప్పటివరకు అరెస్టు కూడా చేయలేదని కేవలం ఎన్‌సిబి చట్టపరమైన విధంగా విచారణ మాత్రమే జరుగుతోందని జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అయితే క్రూయిజ్ పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులను కూడా ఎన్‌సిబి అదుపులోకి తీసుకొని పలు అనుమనలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
|
ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు
ఇక ఇప్పటికే ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక అతనితో పాటు మరికొందరు డ్రగ్స్ కలిగి తీసుకున్నారా లేదా అనే విషయంలో తనిఖీ చేయడానికి అధికారులు స్కాన్ చేస్తున్నారని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. ఇలాంటి పార్టీలకి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల అధికారులకు సమాచారం అందడంతో ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇక మాదకద్రవ్యాలు ఎవరైనా తీసుకున్నారా లేదా అనే విషయం తెలుసు కోవాలని ఫోన్ చాట్‌లపై నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.

బడా వ్యాపారవేత్తల అమ్మాయిలు కూడా
క్రూయిజ్ పార్టీ కోసం ఢిల్లీ నుండి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విచారణ అనంతరం క్లారిటీ ఇవ్వనున్న షారుఖ్
ఆర్యన్ ఖాన్ షారూఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ పెద్ద కుమారుడు అని అందరికి తెలిసిన విషయమే. ఇక డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్నారు అనగానే అతని పేరు ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక షారుక్ కు సుహానా ఖాన్ అనే కుమార్తె అలాగే మరొక కుమారుడు అబ్రామ్ కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న షారుక్ కూడా విచారణ అనంతరం ఈ విషయంపై స్పందించనున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది దగ్గర డ్రగ్స్..
ఈ విషయం తెలిసిన వ్యక్తులు ఎన్‌సిబి క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీపై దాడి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆపరేషన్ అర్ధరాత్రి జరిగింది. ఎన్‌సిబి అధికారులు దాడి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్న వారి నుండి కొకైన్, ఎండిఎమ్‌ఎ, మెఫెడ్రోన్ మరియు చరస్ వంటి అనేక డ్రగ్స్‌ను కనుగొన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో షారుఖ్ తనయుడు ఉన్నాడా లేడా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.