twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరణం కేసులో మరో ఇద్దరికి షాక్.. సిద్దార్థ్ పితాని అరెస్ట్ తర్వాత మరోసారి ఎన్సీబీ పంజా

    |

    బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మరోసారి పంజా విసిరింది. బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఈ సంస్థ తాజాగా అరెస్టులతోపాటు సమన్లు కూడా జారీ చేసి కేసు వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మే 28 తేదీన సుశాంత్‌కు సన్నిహితుడు సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఎన్సీబీ చేస్తున్న దర్యాప్తులోకి వెళితే..

    ఈడీ ఆదేశాలతో రంగంలోకి ఎన్సీబీ

    ఈడీ ఆదేశాలతో రంగంలోకి ఎన్సీబీ

    అనుమానాస్పదంగాను, సంచలనంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అసలు విషయాలు బయటకు తీసుకురావడానికి ఈడీ రంగంలోకి దిగింది. అయితే ఈడీ ఆదేశాల మేరకు సుశాంత్ మరణం వెనుక ఏదైనా డ్రగ్స్ మాఫియాకు లింకు ఉందానే అనే కోణంలో ఎన్సీబీ దర్యాప్తు చేపట్టింది. డ్రగ్స్ వినియోగం, నిల్వ, సరఫరా లాంటి అంశాలపై తీవ్రంగా పరిగణించి.. కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది.

    సుశాంత్ పని మనుషులకు సమన్లు

    సుశాంత్ పని మనుషులకు సమన్లు

    హైదరాబాద్‌లో సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేసిన తర్వాత తన కస్టడీలో ఉంచుకొని విచారిస్తున్నది. ఈ క్రమంలో సుశాంత్ ఇంటిలో పని మనుషులుగా ఉన్న నీరజ్, కేశవ్‌ను ప్రశ్నించేందుకు ఎన్సీబీ ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని మీడియాకు అధికారులు స్వయంగా వెల్లడించారు.

    ఎన్సీబీ ధృవీకరణతో

    ఎన్సీబీ ధృవీకరణతో

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంతో లింకు ఉన్న డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నాం. ఆ క్రమంలోనే నీరజ్, కేశవ్‌కు సమన్లు జారీ చేశాం. సిద్దార్థ్ అరెస్ట్ తర్వాత ఈ కేసులో వీరిద్దరి పాత్ర కూడా కీలకంగా మారింది. అందుకే వారికి సమన్లు జారీ చేశాం అని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు.

    Recommended Video

    Sushant Singh Rajput: తప్పించుకు తిరుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ స్నేహితుడు రిషికేష్ పవార్...!!
    సిద్దార్థ్ పితానిపై పలు సెక్షన్లతో కేసు నమోదు

    సిద్దార్థ్ పితానిపై పలు సెక్షన్లతో కేసు నమోదు

    సిద్దార్థ్ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తర్వాత NDPS Act, 1985 కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. జూన్ 1వ తేదీ వరకు అతడిని కస్టడీకి అప్పగించడంతో పితానిని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నీరజ్, కేశవ్‌తోపాటు పితానిని కూడా కలిపి ప్రశ్నించే అవకాశాలు లేకపోలేవనే విషయాన్ని మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    English summary
    The Narcotics Control Bureau (NCB) summons Sushant Singh Rajupt's domestic help Neeraj, Keshav after Siddharth Pithani's arrest. We have summoned Neeraj and Keshav for questioning, in the drugs case linked to Rajput's death," NCB sources told ANI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X