twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడి రాసలీలలు.. మార్చకపోయినా పర్వాలేదు, హృతిక్‌కు చెడ్డపేరు రాకుండా!

    |

    ఇటీవల మీటూ ఉద్యమంతో బాలీవుడ్ మోతెక్కిపోయిన సంగతి తెలిసిందే. నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా వరుసగా బడా సెలెబ్రిటీల పేర్లు లైంగిక వేధింపుల నేపథ్యంలో బయటకు వచ్చాయి. నానా పాటేకర్, వికాస్ బహల్, షాజిద్ ఖాన్ లాంటి ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమ నేపథ్యంలో హౌస్ ఫుల్ 4, సూపర్ 30 లాంటి చిత్రాలే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ చొరవతో హౌస్ ఫుల్ 4 నుంచి నానా పాటేకర్ ని, సూపర్ 30 నుంచి వికాస్ బహల్ ని తొలగించారు.

    మహిళని దారుణంగా

    మహిళని దారుణంగా

    వికాస్ బహల్ సూపర్ 30 చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో అతడు తనని లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాలా నీచంగా ప్రవర్తించాడని సదరు మహిళ పేర్కొంది. దీనితో వికాస్ బహల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో సూపర్ 30 లో హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    షూటింగ్ ఆపేయాలంటూ

    షూటింగ్ ఆపేయాలంటూ

    వెంటనే స్పందించిన హృతిక్ రోషన్ విచారణలో వాస్తవాలు తేలేవరకు షూటింగ్ ఆపేయాలంటూ నిర్మాతలని ఆదేశించారు. దీనితో సూపర్ 30 చిత్రం పూర్తిగా ఆగిపోతుందేమో అనే అనుమానాలు తలత్తాయి. ఆ తరువాత ఏఈ చిత్రం నుంచి వికాస్ బహల్ ని దర్శకుడిగా తొలగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తనకు చెడ్డపేరు రాకుండా హృతిక్ ఈ వివాదం విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు.

    మార్చకపోయినా పర్వాలేదు

    మార్చకపోయినా పర్వాలేదు

    సూపర్ 30 చిత్రం నుంచి వికాస్ బహల్ తప్పుకున్నా సినిమాకు పెద్ద నష్టం లేదని అంటున్నారు. కొత్త దర్శకుడు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఎడిటింగ్ మాత్రమే మిగిలివుందని అంటున్నారు. టైటిల్ కార్డ్స్ లో దర్శకుడిగా వికాస్ బహల్ పేరే కొనసాగుతుందట. కానీ ఇకపై సినిమా కోసం నిర్వహించే పనుల్లో అతడి ప్రమేయం ఉండదని అంటున్నారు.

    నష్టం ఆ చిత్రానికే

    నష్టం ఆ చిత్రానికే

    ఆ విధంగా హృతిక్ రోషన్ సినిమా సేఫ్ అయిపోయింది. కానీ హౌస్ ఫుల్ 4 చిత్రానికి మాత్రం నష్టం వాటిల్లింది. ఆ చిత్రంలో నానా పాటేకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు సంబందించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఈ సమయంలో మీటూ ఆరోపణల కారణంగా నానా పాటేకర్ సినిమా నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. నానా పాటేకర్ స్థానంలో టాలీవడ్ హీరో రానాని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు నానా పాటేకర్ సన్నివేశాల్ని మళ్ళీ రీషూట్ చేయాల్సి ఉంటుంది.

    English summary
    No replacement of Vikas Bahl as the director for Hrithik Roshan starrer.Super 30 stars Hrithik Roshan in the lead role and it is based on Mathematician Anand Kumar's life
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X