twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    AR Rahman సరికొత్త ప్రయోగం.. మ్యూజిక్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'కత్రార్'కు ఇంకొక్క అడుగు!

    |

    ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ టాప్ లో ఉంటారు అని చెప్పవచ్చు. కేవలం ఒక దేశానికి మాత్రమే కాకుండా ఆయన ప్రపంచానికి కూడా నచ్చే విధంగా పాటలు కంపోజ్ చేస్తారు. సంగీతం అనేది భాషకు సంబంధించింది అలాగే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని కూడా ఆయన నిరూపించారు. అప్పుడప్పుడు ఈ సంగీతంలో పలు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే మెటావర్స్ కు సంబంధించిన కత్రార్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన ఆయన తాజాగా మరికొన్ని విషయాలు పంచుకున్నారు.

    కొత్త మ్యూజిక్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్..

    కొత్త మ్యూజిక్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్..

    ప్రపంచవ్యాప్తంగా తన మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ ఇప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రెహమాన్ తన కంపోజింగ్ తోనే ఎన్నో విభిన్నమైన వాయిద్యాలను సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చి మంచి ప్రాముఖ్యతను తీసుకు వచ్చారు. ఇక దేశ విదేశాల్లో కూడా ఆయన పనితనానికి మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక సినిమాటిక్ సెన్సరీ అనుభవాన్ని కూడా విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కొత్త మ్యూజిక్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కత్రార్ ప్రాజెక్ట్ లాంచ్ కు ఇంకొంచెం సమయం మాత్రమే ఉందని చెప్పి ఆశ్చర్యపరిచారు.

     ఇంకా ఒక్క అడుగు మాత్రమే..

    ఇంకా ఒక్క అడుగు మాత్రమే..

    జనవరి 6న ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వతంత్ర సంగీతకారులు, ఆర్టిస్టుల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన మెటావర్స్ ప్రాజెక్ట్ కత్రార్ గురించి మరింతా వెల్లడించారు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా సంగీతంలోని వివిధ కళారూపాలను పొందుపర్చడం, దాని ద్వారా త్వరగా డబ్బు సంపాదించుకుని వెసులుబాటును ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ కు అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఏఆర్ రెహమాన్. "నేను ఇవాళ కత్రార్ మెటావర్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎంతో ఎగ్జైట్ గా ఉన్నాను. కత్రార్ ప్రారంభించడానికి ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది. కత్రార్ కు సంబంధించిన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను" అని ట్వీట్ ద్వారా తెలిపారు.

    నేరుగా ఆదయాన్ని అర్జించేందుకు..

    నేరుగా ఆదయాన్ని అర్జించేందుకు..

    ఈ కత్రార్ ప్రాజెక్ట్ అనేది HBAR నెట్ వర్క్ ఫౌండేషన్ ద్వారా అమలు చేయబడుతుందని అందులో ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. అలాగే కత్రార్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. "కత్రార్ ఒక విజన్. కత్రార్ ఒక ట్రెడిషన్. కత్రార్ ఒక జ్ఞానం. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా కొత్త ప్రతిభావంతులను, కొత్త సాంకేతికతను తీసుకురావడానికి, కళకారులకు నేరుగా ఆదాయాన్ని అర్జంచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సహాయపడటానికి, భవిష్యత్తు వారిధిగా ఉపయోగపడుతుంది" అని వీడియోలో చెప్పుకొచ్చారు ఏఆర్ రెహమాన్.

    English summary
    Oscar Winner And Sensational Music Director AR Rahman Announces Launch Of New Digital Music Platform Katraar On His Birthday January 6
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X