twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడం మంచిదే.. నన్ను తిట్టడానికి ఇదొక అవకాశం.. స్టార్ హీరో!

    |

    గత ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన బడా చిత్రాలలో అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం ఒకటి. దాదాపు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. అందులో సగం వసూళ్ళు కుడా రాబట్టలేకపోయింది. దీనితో బాలీవుడ్ చరిత్రలోనే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్ర పరాజయం తర్వాత ఎట్టకేలకు అమీర్ ఖాన్ స్పందించాడు. సినిమా ప్లాప్ అయినందుకు తను భాద్యత వహిస్తునానని తెలిపారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంపై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    అతిపెద్ద పరాజయం

    అతిపెద్ద పరాజయం

    గత ఏడాది అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఫాతిమా సనా ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం మునుపెన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో విడుదలయింది. కానీ అమిర్ ఖాన్ కెరీర్ లోనే అతిపెద్ద పరాజయంగా ఈ చిత్రం మిగిలిపోయింది. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య కథ, కథనంతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. సినీ విశ్లేషకుల నుంచి ఈ చిత్రానికి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

     ఆయన్ని వదిలేయండి

    ఆయన్ని వదిలేయండి

    ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్ర దర్శకుడు విజయ్ కృష్ణని విమర్శించడం ఇక ఆపండి. ఆయన్ని వదిలేయండి అని అమీర్ ఖాన్ తెలిపాడు. ఏ దర్శకుడైనా మంచి సినిమా తీయాలనే అనుకుంటాడు. మేమంతా మంచి సినిమా తీయాలనే కష్టపడ్డాం. కానీ కొన్నిసార్లు మా ప్రయత్నాలు ఫలించవు. దర్శకుడి టీంలో నేను కూడా ఓ ప్లేయర్ ని. దర్శకుడు ఫెయిల్ అయ్యాడంటే నేను కూడా ఫెయిల్ అయినట్లే అని అమిర్ తెలిపాడు.

    మహాభారతమా? అదేంటి.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్మహాభారతమా? అదేంటి.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

     భాద్యత నాదే

    భాద్యత నాదే

    ఈ చిత్ర పరాజయం పట్ల నేనే భాద్యత వహిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది అమిర్ ఖాన్ చిత్రం అని చూడడానికి వచ్చి ఉంటారు. నా పేరు ఉంది కాబట్టే ఆడియన్స్ సినిమా చూశారు. వాళ్లందరికీ నేను సమాధానం చెప్పాలి అని అమిర్ తెలిపాడు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాన్ని ఇష్టపడిన ప్రేక్షకులను కూడా ఉన్నారు. కాబట్టి అదే పనిగా విమర్శలు చేయడం సరికాదని అమిర్ తెలిపాడు.

    ప్లాప్ కావడం మంచిదే

    ప్లాప్ కావడం మంచిదే

    ఏది ఏమైనా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం ప్లాప్ కావడం ఒకరకంగా మంచిదే అని అమిర్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. నా చిత్రం పరాజయం చెంది చాలా ఏళ్ళు గడుస్తోంది. నన్ను తిట్టాలనుకునే వారికీ ఈ చితం ద్వారా ఓ అవకాశం వచ్చిందని అమిర్ ఖాన్ తెలిపాడు. ఆల్రెడీ చాలా మంది నన్ను తిట్టేశారు. కాబట్టి నాపై వారి కోపం తగ్గి ఉంటుందని అమిర్ ఖాన్ తెలిపాడు.

    English summary
    People got an opportunity to take out their anger: Aamir Khan on 'Thugs' failure
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X