twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కేదార్‌నాథ్’ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ కోట్టివేసిన కోర్టు

    |

    సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతూ తెరకెక్కిన 'కేదార్‌నాథ్' చిత్రం చుట్టూ పలు వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని, దీనిపై బ్యాన్ విధించాలనే డిమాండ్స్ సైతం గతంలో వినిపించాయి. సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జంటగా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు.

    తాజాగా 'కేదార్‌నాథ్' వ్యతిరేకంగా పిటీషన్ దాఖలవ్వగా... బాంబే హైకోర్ట్ దాన్ని తోసి పుచ్చింది. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని బేస్ చేసుకుని ప్రేమ కథా చిత్రాన్ని తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. సెన్సార్ బోర్డ్ మరోసారి ఈ సినిమా కథను పున:సమీక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో పేర్కొన్నారు.

    కేదార్‌నాథ్ సినిమా నిర్మాత తరుపున వాదించిన అడ్వకేట్ ప్రసాద్... సినిమా కేదార్‌నాథ్ బ్యాక్ డ్రాపుతో తెరకెక్కిన చిత్రం కాబట్టే ఆ టెంపుల్ చూపించామని తెలిపారు. ఒక ప్రాంతం నేపథ్యంలో సినిమా వస్తున్నపుడు ఆ ప్రాంతంలోని ప్రదేశాలు, దేవాలయాలు చూపించకుండా సినిమా తీయడం సాధ్యం కాదు అన్నారు.

    Petition against Kedarnath dismissed by Bombay High Court

    2012లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమా లార్డ్ కృష్ణ మీద తీశారు. ఆ తర్వాత 'పికె'‌లో కొందరు బాబాలను చూపించినపుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. యూపి గవర్నమెంట్ సైఫ్ అలీ ఖాన్-దీపిక పదుకోన్ 'ఆరక్షణ్' సినిమాపై బ్యాన్ విధించింది. ఆయా కేసుల్లో సుప్రీం కోర్టు ఒకటే చెప్పింది. ఒకసారి సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసి గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కోర్టులు కల్పించుకోకూడదని సూచింది అని వాధించారు.

    సినిమా విడుదలకు మరొక రోజు మాత్రమే ఉందని, ఈ సినిమాలో మత పరమైన మనోభావాలు దెబ్బతిన్నట్లు సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని నిర్మాత తరుపు లాయర్ వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్ట్... ఈ చిత్రానికి వ్యతిరేకంగా నమోదైన పిటీషన్ కొట్టిపారేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 7న 'కేదార్‌నాథ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Petition against Kedarnath dismissed by Bombay High Court. Kedarnath, starring Sara Ali khan and Sushant singh Rajput, is set to hit the screens on December 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X