twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూట్యూబ్ చరిత్రలో సంచలనం, 8 కోట్ల మందికి పైగా.. 'ప్యూడైపై'కు దెబ్బేసిన టి సిరీస్!

    |

    యూట్యూబ్ లో తరచుగా వ్యూస్ విషయంలో రికార్డులు నమోదవుతుంటాయి. ప్రపంచంలో వీడియోల్ని అందించే సంస్థగా యూట్యూబ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిజిటల్ రంగంలో యూట్యూబ్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇండియాకు చెందిన సంస్థలు యూట్యూబ్ లో అద్భుతాలు చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ యొక్క పాపులారిటీని సబ్ స్క్రైబర్ల సంఖ్య ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ అంశంలో యూట్యూబ్ దిగ్గజం ప్యూడైపై ఛానల్ తో భారత సంస్థ టి సిరీస్ హోరా హోరీ తలపడుతోంది.

    తలపడుతున్న ఆ రెండు

    తలపడుతున్న ఆ రెండు

    ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధికంగా పాపులర్ అయిన సంస్థగా యూట్యూబ్ స్టార్ ఫెలిక్స్ కు చెందిన ప్యూడైపై ఉండేది. ఈ ఛానల్ కు యూట్యూబ్ లో 83,842,513 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇదే. ప్రస్తుతం ఈ ఛానల్ కు ఇండియాకు చెందిన టి సిరీస్ ఛానల్ గట్టి పోటీ ఇస్తోంది. టి సిరీస్ జోరు చూస్తుంటే మరి కొద్దీ రోజుల్లోనే ప్యూడైపైని దాటేయసేలా కనిపిస్తోంది. టి సిరీస్ కు ప్రస్తుతం 83,684,446మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అంటే టి సిరీస్ కేవలం 1.5 లక్షల సబ్ స్క్రైబర్లు దూరంలో ఉంది.

    అందనంత దూరంలో

    అందనంత దూరంలో

    టి సిరీస్ సంస్థ ఇప్పటికే వ్యూస్ విషయంలో మరే ఛానల్ కు అందనంత ఎత్తులో ఉంది. 60 బిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బాగా పాపులర్ అయిన కెటి పెర్రీ, జస్టిన్ బీబర్ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కంటే టి సిరీస్ వ్యూస్ మూడు రెట్లు. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ మార్కెట్ యుగం నడుస్తుడడంతో టి సిరీస్ సంస్థ దూసుకుపోతోంది.

    గుల్షన్ కుమార్

    గుల్షన్ కుమార్

    టి సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఈ సంస్థని 1983లో స్థాపించారు. 2000లో గుల్షన్ కుమార్ కొడుకు గుల్షన్ భూషణ్ 2000లో సంస్థ భాద్యతలు చేపట్టాడు. టి సిరీస్ ని డిజిటల్ మార్కెట్ లోకి తీసుకురావాలనే ఆలోచన చేయడంతో సంస్థ దశ ఒక్కసారిగా మారిపోయింది. డిజిటల్ మార్కెట్ లో విప్లవం రావడం, ఇంటర్ నెట్ సేవలు పెరగడంతో టి సిరీస్ సంస్థ తిరుగులేని పురోగతిని సాధించింది. గుల్షన్ కుమార్ తండ్రి పాన్ షాప్ యజమాని కావడం విశేషం.

    ఆధిపత్యం నిలుపుకునేందుకు

    ఆధిపత్యం నిలుపుకునేందుకు

    టి సిరీస్ సంస్థ ఎదుగుదల ప్యూడైపైకు ఇబ్బంది కలిగిస్తోంది. తన ప్రతిష్టని నిలుపుకునేందుకు ప్యూడైపై అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ఎత్తులు వేస్తోంది. రాజకీయపలుకుబడిని కూడా ఉపయోగించి తానే ప్రపంచంలో అత్యుత్తమ ఛానల్ అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్యూడైపై ఎన్ని ఎత్తులు వేసినా టి సిరీస్ జోరు మాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజుల్లోనే ప్యూడైపై ని టి సిరీస్ దాటేసే అవకాశాలు ఉన్నాయని డిజిటల్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

    English summary
    PewDiePie Vs T-Series: YouTube war between these two channels
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X