twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ రోషన్ తండ్రికి క్యాన్సర్... కోలుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్!

    |

    ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ గొంతు క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని హృతిక్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు. అయితే ఈ ట్వీట్ మీద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించడం చర్చనీయాంశం అయింది.

    రాకేష్ రోషన్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించిన మోడీ... ఆయన్ను అత్యంత ధైర్యంగా పోరాటం చేసే ఫైటర్‌గా పేర్కొన్నారు. ఒక ఫిల్మ్ మేకర్ గురించి ప్రధానమంత్రి ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    అసలు విషయం బ్రేక్ చేసిన హృతిక్

    అసలు విషయం బ్రేక్ చేసిన హృతిక్

    ఈ రోజు ఉదయం మా నాన్నను ఒక ఫోటో దిగాలని అడిగాను. సర్జరీ రోజు కూడా ఆయన జిమ్ మిస్ అవ్వరని నాకు తెలుసు. బహుషా నాకు తెలిసిన స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆయనే. కొన్ని వారాల క్రితం ఆయనకు గొంతుక్యాన్సర్ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఆయన దైర్యంగా పోరాడేందుకు సిద్దమయ్యారు... అంటూ హృతిక్ ట్వీట్ చేశారు.

    డియర్ హృతిక్ అంటూ మోడీ ట్వీట్

    దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘డియర్ హృతిక్.. రాకేష్ రోషన్ జీ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ఒక ఫైటర్.. ధైర్యంగా దాన్ని జయిస్తారనే నమ్మకం ఉంది' అని ట్వీట్ చేశారు.

    సర్జరీ బాగా జరిగిందని చెప్పిన హృతిక్

    నరేంద్ర మోడీ తన తండ్రి ఆరోగ్యం గురించి ఆరాతీయడంపై హృతిక్ సంతోషం వ్యక్తం చేశారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని, ఈ విషయం అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు.

    హృతిక్ సినిమాలు

    హృతిక్ సినిమాలు

    హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘సూపర్ 30' అనే చిత్రంలో నటిస్తున్నారు. వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    After Irrfan Khan, Sonali Bendre and Tahira Kashyap, yet another Bollywood celebrity has been hit by cancer! Rakesh Roshan has been diagnosed with early stage cell carcinoma of the throat. His son, actor Hrithik Roshan took to Instagram to break the news. "Dear Hrithik, praying for the good health of Shri Rakesh Roshan Ji. He is a fighter and I am sure he will face this challenge with utmost courage," Prime Minister Narendra Modi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X