For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చచ్చిపోతానని అనుకున్నా.. జంతువుకంటే దారుణంగా కొట్టాడు: భర్త దాడిపై స్పందించిన పూనమ్

  |

  బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఇటీవల వివాహానికి సంబంధించిన గొడవతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తన భర్త, చిత్ర నిర్మాత సామ్ బాంబేపై పోలీస్ కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి చేసుకొని 10రోజులు కూడా కాలేదు. అప్పుడే వారి గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆ వార్తలపై నిన్నటి వరకు పూనమ్ మౌనం వహించారు. ఇక ఎట్టకేలకు ఆమె కొద్దిసేపటి క్రితం మౌనం వీడారు.

  నచ్చకపోయినా కూడా లైంగిక వేధింపులు

  నచ్చకపోయినా కూడా లైంగిక వేధింపులు

  ఈ నెల 10వ తేదీన ఒక ప్రైవేట్ వేడుకలో సామ్‌ను వివాహం చేసుకున్న పూనమ్, ఇటీవల భర్తతో కలిసి గోవాకు ఎంతో సంతోషంగా వెళ్లింది. అయితే అక్కడ సామ్‌ తనపై దాడి చేశాడని నచ్చకపోయినా కూడా లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేసింది. ఇక ఆ విషయం గురించి ఆమె ఈ విధంగా వివరణ ఇచ్చింది.

  మాట్లాడుతుండగానే కొట్టేశాడు.. హింసాత్మకంగా..

  మాట్లాడుతుండగానే కొట్టేశాడు.. హింసాత్మకంగా..

  సామ్‌తో సంబంధం హింసాత్మకంగా ఉంటుందేమో అని ముందే తెలుసుకున్నాను. కాని పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని విషయాలు మారిపోతాయని భావించాను. సామ్ నిగ్రహాన్ని కోల్పోయి ఇటీవల ఒక జంతువులా ప్రవర్తించాడు. ఇక అతని వద్దకు తిరిగి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఒక విషయంలో ఇద్దరి మధ్య వాదనలు పెరిగాయి. చర్చిస్తున్న సమయంలోనే అతను నన్ను కొట్టడం ప్రారంభించాడు.

  చచ్చిపోతానేమో అనుకున్నా.. జుట్టు పట్టుకొని..

  చచ్చిపోతానేమో అనుకున్నా.. జుట్టు పట్టుకొని..

  అతను నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. నేను చనిపోతానని అనుకున్నాను. నా ముఖంపై కూడా దాడి చేశాడు. జుట్టు పట్టుకొని నన్ను లాగి మంచానికి తలను కొట్టాడు. అతను నా శరీరంపై పడి తీవ్రంగా గాయపరిచాడు. ఏదో విధంగా నేను ఆ గొడవ నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులను పిలవడంతో అతన్ని తీసుకెళ్లారు. వెంటనే అతనిపై పోలీస్ కేసు నమోదు చేశాను.

  ఒక జంతువులాగా కొట్టాడు

  ఒక జంతువులాగా కొట్టాడు

  సామ్ నన్ను ఒక జంతువులాగా కొట్టిన తర్వాత ఇంకా ఆ బంధానికి ముగింపు పలకకపోతే అర్థం ఉండదు. మరోసారి, నేను అతని వద్దకు తిరిగి వెళ్లాలని అనుకోను. కొంచెం కూడా ఆలోచించకుండా ఒక జంతువులాగా కొట్టిన వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లడం మంచి ఆలోచన అని నేను అనుకోను. మా సంబంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి సంబంధం కంటే నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను.

  పెళ్లి బంధానికి ముగింపు పలుకుతున్నాను..

  పెళ్లి బంధానికి ముగింపు పలుకుతున్నాను..

  ఫైనల్ గా మా పెళ్లి బంధానికి ముగింపు పలుకుతున్నాను అంటూ.. పూనమ్ మీడియాకు తెలియజేసింది. ఇక సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత అతను బయటకు రానివ్వకుండా చేస్తానని పూనమ్ చాలెంజ్ చేసింది. అయితే 20,000 రూపాయల ఫైన్ తో సామ్‌కు బుధవారం బెయిల్ లభించింది. దీంతో సామ్, పూనమ్ మళ్ళీ కలుసుకుంటారా అను రూమర్స్ వస్తున్న సమయంలో తనకు ఏ మాత్రం ఇష్టం లేదమి పూనమ్ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది.

  English summary
  Poonam pandey about her husband attack marriage end. Poonam Pandey husband Sam Bombay arrested in Goa: Bollywood actress poonam has given complaint on her husband that, He was molested, threatened and assaulted. On Poonam complaint Canacona polices arrested sam bombay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X