పూనం మీద దారుణంగా భర్త దాడి.. తల గోడకేసి కొట్టడంతో, కంటికి, ముఖానికి గాయాలు.. అసలు ఏమైందంటే?

మోడల్, నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ తన భర్త తన పై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది, ఆ తర్వాత పోలీసులు సోమవారం సాయంత్రం సామ్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతన్ని మూడు రోజుల కస్టడీకి పంపింది. అంతేకాక పూనమ్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తదుపరి విచారణ జరుగుతోంది. దీంతో అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న పూనమ్ పాండే ను సామ్ బాంబే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. గతేడాది డిసెంబర్‌ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దీని తర్వాత ఇద్దరూ గోవా వెళ్లారు కానీ అక్కడ కూడా పూనమ్ మరియు సామ్ మధ్య చాలా గొడవలు జరిగాయి. నటి పూనమ్ పాండే గోవాలో తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పెళ్లయిన 12 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు రావడంతో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పెళ్లయిన కొద్ది రోజులకే

పెళ్లయిన కొద్ది రోజులకే

పెళ్లయిన కొద్ది రోజులకే పూనమ్ సామ్‌పై శారీరక వేధింపులు, బెదిరింపులు, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసులు పెట్టింది. సామ్ తనపై దాడి చేసి బెదిరించాడని ఆమె గోవాలో ఫిర్యాదు చేసింది. అప్పుడు పూనమ్ గోవాలో షూటింగ్‌లో ఉన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ మరుసటి రోజే బెయిల్ వచ్చింది. ఆ సమయంలో పూనమ్ ఈ పెళ్లిని విడాకులతో ముగించాలనుకుంటున్నట్లు చెప్పింది.

అప్పుడే అనుకున్నా

అప్పుడే అనుకున్నా

అయితే, తరువాత పూనమ్ మరియు సామ్ రాజీ పడ్డారు. అప్పటి నుంచి అంతా సజావుగా సాగింది. అయితే ఇప్పుడు వీరి రిలేషన్ షిప్ లో చీలిక వచ్చిందని పూనమ్ చేసిన ఫిర్యాదును బట్టి ఊహించవచ్చు. పూనమ్ భర్త సామ్ బాంబే సినిమా నిర్మాత అని అందరికీ తెలిసిందే.

అతను గల్ బన్ గయీ మరియు బేఫిక్రా వంటి పాటలను నిర్మించారు. ఇక తాజాగా వార్తా సంస్థ ANI నివేదికల ప్రకారం, ముంబై పోలీసులు 'సామ్ బాంబే మీద ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ల కింద నమోదు చేశారు. నటి పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్, సామ్ మధ్య జరిగిన వివాదం గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టి

జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టి

పూనమ్ పాండే ఫిర్యాదు ప్రకారం, పూనమ్ తన మొదటి భార్య అల్విరా విషయంలో సామ్‌తో గొడవ పడ్డాడు. ఈ సమయంలో సామ్ కోపంతో పూనమ్‌ను కొట్టడం ప్రారంభించాడని, ఈ సమయంలో పూనమ్ ముఖానికి గాయమైందని వెల్లడించారు. కోపంతో పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడని, దీని తర్వాత సామ్ పూనమ్ ముఖంపై కూడా గుడ్డాడని అంటున్నారు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
పూనమ్ కు కనిపించడం లేదట

పూనమ్ కు కనిపించడం లేదట

ఈ క్రమంలో పూనమ్ పాండేకి ఒక కన్ను మరియు ఆమె ముఖంపై తీవ్ర గాయమైంది. దీంతో పూనమ్ కు కనిపించడం లేదట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అదే సమయంలో, ఇప్పుడు బాంద్రా పోలీసులు ఈ విషయం మీద మరింత దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X