పూనమ్ పాండేకు చేదు అనుభవం.. పాపం కొన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకొన్నదంతా...
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఎప్పుడూ యాక్టింగ్ ఉండే పూనమ్ తన ఇన్సాట్‌గ్రామ్ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి పలు మార్లు ప్రయత్నించిన అనంతరం ఏదో టెక్నికల్ సమస్య తలెత్తిందని భావించారు. ఆ తర్వాత తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ గురైందనే విషయాన్ని నిర్ధారించుకొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీడియాకు వెల్లడించారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో లాగిన్ అయితే...
రోజువారీ దినచర్య ప్రారంభం కాగానే ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నా అకౌంట్‌లో ఏదో తేడాగా అనిపించింది. నా అకౌంట్‌లో లాగిన్ అయితే ఎక్కడికో తీసుకెళ్తున్నది. దాంతో ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యక్ అయిందని అర్ధమైంది.

కొన్నేళ్ల కష్టార్జితంతో ఫాలోవర్స్
కొన్నేళ్లుగా నిజాయితీతో కూడిన ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నాను. అలాంటి అకౌంట్‌కు ఏమన్నా అవుతుందా అనే భయం వెంటాడుతున్నది. లక్షలాది ఫాలోవర్స్ పరిస్థితి ఏమౌంతుందనే బెంగగా ఉంది. ఈ క్రమంలో ఇన్స్‌టాగ్రామ్ నిర్వాహకులను సహాయం కోసం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాను అని పూనమ్ తెలిపారు.

యధావిధిగా నా చేతికి వస్తుందని...
నా అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడంతో నా ఫాలోవర్స్ అందరూ నా ట్విట్టర్ అకౌంట్‌కు కనెక్ట్ అయి నాతో ఛాటింగ్ చేస్తున్నారు. నా పాత ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను పొరపాటున ఏదైనా మెసేజ్ వస్తే దయచేసి సమాధానం ఇవ్వవద్దు. త్వరలోనే నా అకౌంట్ తిరిగి నా చేతికి వస్తుందని భావిస్తున్నాను అంటూ పూనమ్ పాండే తెలిపారు.

పెళ్లైన నెలరోజులకే భర్తతో గొడవలు
ఇక పూనమ్ పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2020లో వివాదాలు, సంచలన వార్తలతో ముగిసిపోతున్నది. లాక్‌డౌన్‌లో సామ్ బాంబేను పెళ్లి చేసుకొన్న ఈ శృంగార తార నెలలోపే మొగుడితో గొడవ పడింది. ఏకంగా భర్తపై ఫిర్యాదు చేయడంతో గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











