»   » కుర్ర హీరోయిన్‌కు తల్లిగా ప్రియాంక చోప్రా.. గుండె బరువెక్కే కథలో..

కుర్ర హీరోయిన్‌కు తల్లిగా ప్రియాంక చోప్రా.. గుండె బరువెక్కే కథలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌ మోజులో హిందీ చిత్రాలకు దూరమైన అందాల తార ప్రియాంకచోప్రా బాలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారనున్నారు. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే సల్మాన్ ఖాన్‌‌ సరసన భారత్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీలో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఓ కుర్ర హీరోయిన్‌కు తల్లిగా నటించనున్నారనే వార్తలు బాలీవుడ్ పత్రికలను విపరీతంగా ఆకర్షించింది.

యదార్థ సంఘటన ఆధారంగా

యదార్థ సంఘటన ఆధారంగా

బాలీవుడ్‌లో యదార్థ సంఘటన ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనున్నది. పూణేకు చెందిన ఆయేషా చౌదరీ విషాద గాధ నేపథ్యంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అయేషా చౌదరీగా దంగల్ ఫేం జైరా వసీం నటించనున్నారు. జైరా వాసీంకు తల్లిగా ప్రియాంక, తండ్రిగా అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు.

 ఆయేషా చౌదరీ విషాదగాధ

ఆయేషా చౌదరీ విషాదగాధ

ఆయేషా చౌదరీ 18 ఏళ్ల వయసులో అరుదైన వయసులో మరణించారు. చిన్నతనంలో ఇమ్యునోడెఫిషియెన్సీ డిజార్టర్‌తో బాధపడ్డారు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో పల్మోనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధికి గురయ్యారు. అనేక బాధలు, సమస్యల అనంతరం ఆయేషా ఈ లోకాన్ని విడిచారు.

జైరా వసీం గ్రీన్ సిగ్నల్

జైరా వసీం గ్రీన్ సిగ్నల్

గుండెను పిండివేసే విషాదగాధ విని జైరా వసీం ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్క్రిప్టు చదివిన వెంటనే జైరా ఉద్వేగానికి గురై ప్రాజెక్టులో నటించడానికి ముందుకొచ్చారట. ప్రస్తుతం జైరా వసీం డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఆగస్టులో సెట్స్ పైకి

ఆగస్టులో సెట్స్ పైకి

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. జైరాకు ప్రియాంక, అభిషేక్ తల్లిదండ్రులగా నటిస్తున్నారనే నిజం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి షొనాలీ బోస్ దర్శకత్వం వహించనున్నారు.

ప్రియాంక, అభిషేక్ బచ్చన్ జంటగా

ప్రియాంక, అభిషేక్ బచ్చన్ జంటగా

ఆయేషా జీవితకథలో నటిస్తున్నామనే విషయాన్ని ఇంకా ప్రియాంక, అభిషేక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. హాలీవుడ్‌లో ప్రియాంక నటిస్తున్న క్వాంటికో క్యాన్సిల్ అయింది. మన్మరాజియా అనే చిత్రాన్ని అభిషేక్ ఇటీవలే పూర్తి చేశారు.

English summary
A movie is going to hit the bollywood screen the story is inspired by the true-life story of Aisha Choudhary. Choudhary was born with an immunodeficiency disorder and was also diagnosed with pulmonary fibrosis at the age of 13. Abhishek and Priyanka to play Zaira Wasim's parents in Shonali Bose's film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X