ముంబైలో మరో రెండిళ్ళు అమ్మేసిన ప్రియాంకా చోప్రా.. ఎన్ని కోట్లకో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ, నటి ప్రియాంక చోప్రా తాజాగా ఆస్తి వార్తలతో మళ్ళీ వార్తల్లో నిలిచింది. మీడియా నివేదికల ప్రకారం ప్రియాంక తన ఆస్తులలో కొన్నింటిని విక్రయించింది. మరి కొన్నింటిని లీజుకు ఇచ్చిందని అంటున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వ్యవహారంలో వెళితే ప్రియాంక ఈ ఏడాది మార్చిలో ముంబైలో 7 కోట్ల రూపాయల ఆస్తిని అమ్మేసిందనే వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంతో ఇష్టపడి అంధేరి వెస్ట్‌లోని వెర్సోవాలోని రాజ్ క్లాసిక్ భవనంలో 7వ అంతస్తులో రూ.3 కోట్ల వ్యయంతో ఒక అపార్ట్‌మెంట్ ను ఆమె కొనుక్కున్నది. అదే సమయంలో అదే అంతస్తులో మరో అపార్ట్‌మెంట్‌ను రూ.4 కోట్లకు ఆమె అమ్మేసింది.
ఇది మాత్రమే కాక ప్రియాంక ముంబైలోని తన కార్యాలయ స్థలాన్ని కూడా అద్దెకు ఇచ్చేసిందని అంటున్నారు. ప్రియాంకకు సంబంధించిన ఈ ప్రాపర్టీ ముంబైలోని ఓషివారాలో ఉంది. ఈ సంవత్సరం జూన్ లో అద్దెకు ఇవ్వబడింది. 2040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయాన్ని అద్దెకు ఇచ్చి దాని ద్వారా నెలకు రూ.2.11 లక్షలు సంపాదిస్తోంది. ప్రియాంక గత ఏడాది ఫిబ్రవరిలో అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న కరణ్ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఒక అపార్ట్‌మెంట్‌ను కూడా అమ్మేసింది. దీని విలువ రూ.2 కోట్లు. నిక్, ప్రియాంక వివాహం 2018 డిసెంబర్‌లో జరిగిన విషయం తెలిసిందే.

ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక ఇల్లు కొన్నారు. 20,000 చదరపు అడుగుల స్థలంలో ఈ దంపతులు విలాసవంతమైన ఇంటిని కట్టుకున్నారు. ఆధునిక హంగులతో అద్భుతమైన ఇంటీరియర్ తో తమకు ఇష్టమైన విధంగా కట్టించుకున్న ఆ ఇంటి కోసం ఏకంగా 144 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఇంట్లో ఏడు బెడ్ రూములు, 11 బాత్ రూమ్ లు, ఎత్తైన పైకప్పులు, ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రియాంక తల్లి మధు చోప్రా స్వయంగా వెల్లడించింది. ప్రియాంక కూడా తన అందమైన ఇంటి ఫోటోలు చాలాసార్లు పంచుకుంది.


Click it and Unblock the Notifications











