»   » బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ: రేస్ 3... సల్మాన్ అండ్ ఫ్యామిలీ ఇదే!

బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ: రేస్ 3... సల్మాన్ అండ్ ఫ్యామిలీ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Race 3 Movie First Poster Released

బాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద ప్రాజెక్ట్ 'రేస్ 3'. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్, డైసీ షా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం న్యూ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా 'రేస్ 3' ఫ్యామిలీని పరిచయం చేశారు. నీకు ఫ్యామిలీ ఉన్నపుడు శత్రువులు అవసరం లేదు అనే క్యాప్ తగిలించడం ద్వారా సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సికిందర్ పాత్రలో కనిపించబోతున్నారు. జెస్సికా పాత్రలో జాక్వెలిన్, సిజ్లింగ్ సంజన పాత్రలో డైసీ షా, యాంగ్రీ యంగ్ మ్యాన్ సూరజ్ పాత్రలో సాఖిబ్ సలీమ్, విలన్ పాత్రలో ఫ్రెడ్డీ దరువాలా, 'బాస్' శంషేర్ పాత్రలో అనిల్ కపూర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

రేసు మొదలైంది

రేసు మొదలైంది

‘రేస్ 3' పోస్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సల్మాన్ ఖాన్ రేసు మొదలైంది. ఇదే మా రేస్ 3 ఫ్యామిలీ. ఈద్ నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలిపారు.

ఈ ఇద్దరు లేడీస్ మధ్య క్యాట్ ఫైట్

ఈ ఇద్దరు లేడీస్ మధ్య క్యాట్ ఫైట్

ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా మధ్య పోటా పోటీ వాతావరణం ఉంటుందని, ఇద్దరి మధ్య వచ్చే సీన్లు.... ముఖ్యంగా ఫైట్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయని అంటున్నారు.

అదిరిపోయే ఫైట్ సీన్లు

అదిరిపోయే ఫైట్ సీన్లు

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం జాక్వెలిన్, డైసీ షా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారట. వీరి మధ్య జరిగే ఫైట్ సన్నివేశాలు అబుదాబిలో చిత్రీకరించాని సమాచారం. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ కూడా అక్కడే జరుగుతోంది.

ఇద్దరూ మంచి ఫ్రెండ్స్

ఇద్దరూ మంచి ఫ్రెండ్స్

జాక్వెలిన్, డైసీ షా కేవలం సినిమాలో మాత్రమే శత్రువుల్లా నటించారు. రియల్ లైఫ్‌లో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర పాత్రల పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.

 ఉత్కంఠ రేపే యాక్షన్ సీన్లతో

ఉత్కంఠ రేపే యాక్షన్ సీన్లతో

‘రేస్ 3' మూవీ బాలీవుడ్లోనే ది బెస్ట్ యాక్షన్ సినిమాగా నిలవబోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని, ఉత్కంఠ రేపే సీన్లు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయిని టాక్. జూన్ 15, 2018న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Since the last few days, Salman Khan has been introducing us to his 'Race 3' family by dropping a new character poster each day as promised. And now, Salman has shared a brand new poster where he is seen posing with the entire 'Race 3' family. The tagline of the poster reads- 'You don't need enemies when you have a family'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X