»   » నువ్వో వేశ్యవు.. అంతా విప్పేసేటట్టు ఉన్నావే.. రాధికా ఆప్టేకు చేదు అనుభవం

నువ్వో వేశ్యవు.. అంతా విప్పేసేటట్టు ఉన్నావే.. రాధికా ఆప్టేకు చేదు అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu
రాధికా ఆప్టే నీతితప్పిన మహిళ, 'వేశ్య' అంటూ ట్రోల్

పార్చ్‌డ్ సినిమా తర్వాత విలక్షణ నటి రాధికా ఆప్టే ఇమేజ్ మారిపోయింది. తన మనసుకు నచ్చిన విషయాలే కాకుండా హాట్‌హాట్‌గా నటించడానికి సిద్ధమేనని సంకేతాలు ఇచ్చింది. వాస్తవ జీవితంలో కూడా తనకు ఇష్టం వచ్చిన విధంగానే జీవిస్తుంది. తాజాగా గోవాకు విహారయాత్రకు వెళ్లిన ఆమె బికినీలో దర్శనమివ్వడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. అందుకు రాధిక ధీటుగా సమాధానం ఇచ్చారు.

గోవాలో విహారయాత్రకు

గోవాలో విహారయాత్రకు

షూటింగ్ బిజీ నుంచి బయటపడిన రాధిక ఆప్టే తాజాగా విహారయాత్ర కోసం గోవాకు వెళ్లింది. ఆ సందర్భంగా తన ప్రియుడితో కలిసి తాను బికినీలో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫోటోను టార్గెట్‌గా చేసుకొని నెటిజన్లు ట్రోల్ చేశారు.

 అంతా విప్పేస్తావా?

అంతా విప్పేస్తావా?

రాధికా ఆప్టే ఫోటోను ఉద్దేశించి.. నీవు ఓ నీతితప్పిన మహిళవు. ఏదో ఒకరోజు అంతా విప్పేసే మాదిరిగా ఉన్నావు. నీవు ఓ వేశ్యవు అంటూ ఆమెపై ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

నీవు ఓ పోర్న్‌స్టార్‌వు

నీవు ఓ పోర్న్‌స్టార్‌వు

అంతటితో ఆ వ్యక్తి నోటి దురుసును ఆపుకోలేదు. నీవు ఓ పోర్న్‌స్టార్‌వు. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నావు అని కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. మగవారు స్విమ్మింగ్ సూట్స్ ధరిస్తే అలాంటి కామెంట్లు చేస్తావా? మహిళపై అలాంటి కామెంట్లు చేయవద్దు అని సూచించారు.

బీచ్‌లో చీరకట్టుకోవాలా?

బీచ్‌లో చీరకట్టుకోవాలా?

తనపై కామెంట్ చేసిన వ్యక్తిపై రాధిక ఆప్టే తీవ్రంగా స్పందించారు. నా గురించి తప్పుడుగా ట్రోల్ చేశారని ఎవరో చెబితే తెలిసింది. చాలా దారుణంగా కామెంట్ చేశాడు. బీచ్‌లో బికినీ ధరించకుంటే.. చీర కట్టుకొంటారా? అని రాధిక వ్యాఖ్యలు చేసింది.

 సోనమ్, తాప్సీలు బాధితులే

సోనమ్, తాప్సీలు బాధితులే

బికినీ ధరించినందుకు నెటిజన్ల నోటిదురుసుకు బలైన వ్యక్తుల్లో రాధికా ఆప్టే మొదటివారు కాదు. గతంలో బికినీ ధరించిన సోనమ్ కపూర్, తాప్సీ పొన్ను, ఇతర బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇలాంటి చేదు అనుభవాన్నే చవిచూశారు. తాజాగా ఈ అనుభవం రాధికా ఆప్టేకు ఎదురైంది.

ప్యాడ్‌మ్యాన్

ప్యాడ్‌మ్యాన్

రాధికా ఆప్టే తాజాగా ఆర్ బాల్కీ నటించిన ప్యాడ్‌మ్యాన్ చిత్రంలో అక్షయ్‌కుమార్ సరసన నటించింది. సెక్రెడ్ గేమ్స్ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తున్నది. సెక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ రచయిత విక్రమ్ చంద్ర రచించిన నవలకు ఆధారంగా రూపొందుతున్నది.

English summary
Radhika Apte was in Goa to take a much-needed break and soak up some sun. She took to Instagram to share a picture of herself chilling on the beach in a bikini, and it did not take long for trolls to slut-shame her and accuse her of going against 'Indian culture'. In this context, Radhika said, I didn't even know I was being trolled till someone told me. It's ridiculous! Do people expect me to wear a sari on a beach?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu