»   » మొదటిరోజే అంతటి చేదు అనుభవం.. చెంప పగలగొట్టా: రాధికా ఆప్టే

మొదటిరోజే అంతటి చేదు అనుభవం.. చెంప పగలగొట్టా: రాధికా ఆప్టే

Subscribe to Filmibeat Telugu

బోల్డ్ పాత్రలకే కాదు.. అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలోనూ బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ముందుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటి నేహా ధూపియ టాక్‌ షోలో పాల్గొన్న రాధికా.. గతంలో తనకెదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పారు.

'సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టడం అదే నాకు తొలిసారి. ఆరోజు షూటింగ్ విరామంలో ఓ ప్రముఖ దక్షిణాది హీరో నా కాలుపై తన కాలుతో రుద్దడం మొదలుపెట్టాడు. అప్పటికీ అతనికి నాకూ మధ్య కనీస పరిచయం కూడా లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి అతని పగలగొట్టాను' అని రాధికా ఆప్టే వెల్లడించారు.

 Radhika Apte once slapped a Southern superstar, here's why

'కాస్టింగ్ కౌచ్'పై హీరోయిన్లంతా ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్న తరుణంలో రాధికా ఆప్టే ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఇటీవల సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసిన రాధికకు నెటిజెన్స్ నుంచి విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే రాధిక మాత్రం 'బీచ్ లో చీర కట్టుకోమంటారా?' అంటూ వారికి గట్టిగానే బదులిచ్చారు.

English summary
Radhika Apte has time and again proved that she is not a weak flower. From her strong comments on the 'male-dominant' Telugu Industry to her slamming her trollers, Radhika is not the one to take things easy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu