»   » రజనీకాంత్‌తో సల్మాన్ నువ్వా? నేనా?.. బాక్సాఫీస్‌కు ఇత్తడే..

రజనీకాంత్‌తో సల్మాన్ నువ్వా? నేనా?.. బాక్సాఫీస్‌కు ఇత్తడే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భారతీయ సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ల సినిమాలు ఒకే తేదీన రిలీజ్ కావడం సాధారణమే. అప్పుడు రెండు భారీ సినిమాలు తలపడటం ఆసక్తికరంగా మారుతుంది. త్వరలోనే ఇద్దరు భారతీయ సూపర్‌స్టార్ల సినిమాలు ఢీకొనేందుకు సిద్ధమవుతున్నది. అందులో ఒకటి రజనీకాంత్ నటించిన కాలా, మరోటి సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 సినిమా కావడం విశేషం. దాంతో జాతీయ మీడియాలో ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ ప్రాధాన్యతను సంతరించుకొన్నది.

   కాలా విడుదల వాయిదా

  కాలా విడుదల వాయిదా

  వాస్తవానికి కాలా చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో సమ్మె కారణంగా కాలా చిత్రం వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. లైకా ప్రొడక్షన్ రూపొందించే ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు హ్యుమా ఖురేసి, నానా పాటేకర్ నటిస్తున్నారు. ఇంకా నానా పాటేకర్, షియాజీ షిండే, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

   డైరెక్టర్‌గా పా రంజిత్

  డైరెక్టర్‌గా పా రంజిత్

  కాలా చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నది. కబాలి దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  జూన్ 27న రేస్3 చిత్రం

  జూన్ 27న రేస్3 చిత్రం

  కాగా ఇదే జూన్ 27న సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 చిత్రం కూడా రిలీజ్ కానున్నది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సాఖిబ్ సలీమ్, డౌసీషా, అనిల్ కపూర్, ఫ్రెడ్డీ దారువాలా తదితరులు నటిస్తున్నారు.

   బాక్సాఫీస్ దడదడ..

  బాక్సాఫీస్ దడదడ..

  కాలా, రేస్3 చిత్రాలు రంజాన్ పండుగ నేపథ్యంలో రిలీజ్ కానున్నాయనే వార్త బయటకు రావడంతో సినీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఉత్తరాదిలో రేస్3 చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండగా, దక్షిణాదిలో రజనీకాంత్ వసూళ్ల రారాజుగా నిలిచే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు హిట్టయితే సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది.

  English summary
  The ongoing strike in the Tamil film industry has stalled the release of many big-ticket movies including Rajinikanth‘s gangster drama Kaala. The film which was supposed to hit the screens on April 27, has been postponed due to strikes. As per the reports, this movie set release june 27. Interestingly, Salman Khan‘s mega-budget stylish action thriller Race 3 is releasing on the same date. So if this clash happens, it will be Thalaivar versus Sultan at the box office.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more