»   » హాస్పిటల్‌లో ప్రముఖ దర్శకుడు.. ఆరోగ్యంపై రూమర్లు.. నాకు ఆ వ్యాధి లేదు..

హాస్పిటల్‌లో ప్రముఖ దర్శకుడు.. ఆరోగ్యంపై రూమర్లు.. నాకు ఆ వ్యాధి లేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి ఆరోగ్యంపై మీడియాలో అనేక రూమర్లు షికారు చేశాయి. గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ చేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది అని వార్తలు వచ్చాయి. అయితే తన ఆరోగ్యం గురించి వాస్తున్న వార్తలపై రాజ్‌కుమార్ సంతోషి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

 నానావతి హాస్పిటల్‌లో

నానావతి హాస్పిటల్‌లో

బాలీవుడ్‌లో గొప్ప ప్రజాదరణ పొందిన ఘాయల్, అందాజ్ అప్నా అప్నా, దామిని లాంటి చిత్రాలకు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. బుధవారం సాయంత్రం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు.

గుండె సంబంధిత వ్యాధితో

గుండె సంబంధిత వ్యాధితో

రాజ్‌కుమార్ సంతోషి ఆస్పత్రిలో చేరారనే వార్తలు బయటకు రావడంతో మీడియా అప్రమత్తమైంది. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఆంజియోప్లాస్టీ జరిగింది అని కథనాలు వెలువడ్డాయి.

ఆరోగ్యం బాగానే ఉంది

ఆరోగ్యం బాగానే ఉంది

అయితే తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలపై ఆందోళన చెందిన రాజ్ కుమార్ సంతోషి వెంటనే స్పందించారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా హాస్పిటల్‌లో చేరాను. అంతకుమించి ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు.

 మీడియా ఆందోళనపై

మీడియా ఆందోళనపై

నా ఆరోగ్యం సరిగానే ఉంది. నాకు గుండె సంబంధిత వ్యాధులు లేవు. రొటీన్ చెకప్ కోసమే నేను నానావతి హాస్పిటల్‌కు వెళ్లాను. శనివారం వరకు చెకప్స్ జరుగుతాయి. నా పట్ల మీడియా ఆందోళనను అర్థం చేసుకోగలను. మీ ఆదరణకు థ్యాంక్స్ అని రాజ్‌కుమార్ వ్యక్తిగత సిబ్బంది ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.

 రణ్‌దీప్ హుడాతో

రణ్‌దీప్ హుడాతో

ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహ్లాని దర్శకత్వం వహించిన అర్థసత్య చిత్రంతో రాజ్‌కుమార్ సంతోషి తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2013లో షాహిద్ కపూర్, ఇలియానాతో రూపొందించిన పటా పోస్టర్ నిక్లా హీరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రణదీప్ హుడాతో బ్యాటిల్ ఆఫ్ సారాగ్రహీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

English summary
Rajkumar Santoshi, who has directed films like Ghayal and Andaz Apna Apna, was admitted to the Nanavati Hospital in Mumbai on Wednesday evening. While it was being reported that Santoshi was suffering from a heart ailment and has undergone an angioplasty, the filmmaker refuted the news and said that he only came to the hospital for routine tests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu