twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్‌కుమార్ రావు హీరోగా తెలుగు పారిశ్రామికవేత్త బయోపిక్‌.. 29 ఏళ్ల శ్రీకాంత్ బొల్లా ఎవరో తెలుసా?

    |

    కొత్త సంవత్సరంలో, రాజ్‌కుమార్ రావు తన కెరీర్‌లో అతిపెద్ద ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. అంధత్వాన్ని సమస్యగా భావించకుండా సవాల్‌గా భావించి సరికొత్త విజయగాథను రాసుకున్న తెలుగు పారిశ్రామికవేత్త పాత్రలో ఆయన నటించబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    రెండు కళ్ళు లేకుండా

    రెండు కళ్ళు లేకుండా

    ఆ పారిశ్రామికవేత్త పేరు శ్రీకాంత్ బొల్లా. అంధత్వం తన కలలను చిదిమేయకుండా బోలెంట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ స్థాపించి దానిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన ఆయన బయోపిక్ సినిమాగా తెరకెక్కనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సీతారాంపురం అనే ఒక చిన్న పల్లెలో ఒక రైతు కుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన Srikanth Bolla పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు సరి కదా చాలా బాధ పడ్డారు.

    ఎందుకంటే అతను రెండు కళ్ళు లేకుండా పుట్టాడు కాబట్టి. ఇక ఆ ఊరి జనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ శ్రీకాంత్ అమ్మ నాన్న అలా చేయలేదు. " మేము బతికున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి " అని అనేవారట.

    చెంప చెళ్ళుమనిపించి

    చెంప చెళ్ళుమనిపించి

    కానీ కళ్ళు కనబడకపోవడం అనే తప్ప చదువులో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా ఉండేవాడు. కానీ ఇంటర్ లో ' నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని " కాలేజీలు చెప్తే శ్రీకాంత్ కోర్టుకెళ్లి గెలిచి మరీ అడ్మిషన్ తెచ్చుకొన్నాడు. అయితే తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు.

    మళ్ళీ హైదరాబాద్ లో స్కూల్ ఫర్ ది స్పెషల్లీ ఏబుల్డ్ లో చేరాడు. అక్కడ కూడా పిల్లలు అవమాన పెట్టడంతో బాధ తట్టుకోలేక వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకుని చెంప చెళ్ళు మనిపించింది. అది అతని జీవితంలో ఒక గేమ్ ఛేంజింగ్ పాయింట్. అలా కొట్టిన టీచరే శ్రీకాంత్ కు ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. అలా చదివి ఇంటర్ లో 98% సంపాదించగా ఎగతాళి చేసేవారు అందరూ అవాక్కయ్యారు.

    80 శాతం వికలాంగులనే ఉద్యోగులుగా

    80 శాతం వికలాంగులనే ఉద్యోగులుగా

    ఇంటర్ తర్వాత IITలో చేరదామని అనుకుంటే వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. అయినా నిరాశ పడని శ్రీకాంత్ అమెరికా యూనివర్సిటీలకు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తే స్టాన్ ఫర్డ్ సహా మరో 2 యూనివర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కానీ శ్రీకాంత్ హార్వర్డ్ మసాచుసెట్స్ లో చేరాడు. అక్కడ బ్రెయిన్ కాంగ్నిటివ్ సైసెన్స్ లో చేరిన తొలి విదేశీ అంధుడిగా రికార్డు పొందాడు.

    శ్రీకాంత్ ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికా కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ అందుకు ఒప్పుకోకుండా ఇండియా వచ్చాడు. భారత్‌లో దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలనే తపనతో శ్రీకాంత్ భారత్ తిరిగొచ్చారు. కొంత పరిశోధన చేసి రతన్ టాటా ఇచ్చిన ఫండ్స్ తో హైదరాబాద్ కేంద్రంగా 'బొల్లాంట్ ఇండస్ట్రీస్' పేరుతో చిన్న పరిశ్రమ స్థాపించారు. ఇందులో 80 శాతం వికలాంగులనే ఉద్యోగులుగా పెట్టుకున్నారు.

     టి సిరీస్ సంస్థ నిర్మాణంలో

    టి సిరీస్ సంస్థ నిర్మాణంలో

    వక్క నుంచి పేపర్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేయడం ప్రారంభించారు. 2012లో ప్రారంభమైన ఈ పరిశ్రమ ప్రతి ఏటా అద్భుతమైన పురోగతి సాధిస్తూ సంవత్సరానికి రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లు ప్రస్థుతానికి శ్రీకాంత్ కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నారు.

    తిరుమల తిరుమతి ఆలయంలో కూడా శ్రీకాంత్ ఈ సంస్థ రూపొందించిన పేపర్ ప్రొడక్టులనే వినియోగిస్తుండటం గమనార్హం.శ్రీకాంత్ దగ్గర సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. శ్రీకాంత్ స్వయంగా 3000 మంది దివ్యాంగ విద్యార్థులను చదివిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ బొల్లా స్ఫూర్తిదాయకమైన కథకు తుషార్ హీరానందనీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా కోసం టి సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా కృష్ణ కుమార్ మరియు నిధి పర్మార్ హిరనందని వ్యవహరించనున్నారు. ఈ సినిమా కథను సుమిత్ పురోహిత్ మరియు జగదీప్ సిద్ధూ రాశారు.

    జూలై 2022లో షూటింగ్

    జూలై 2022లో షూటింగ్

    ఈ సినిమా షూటింగ్ జూలై 2022 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ, "శ్రీకాంత్ బొల్లా ఒక స్ఫూర్తి.. శ్రీకాంత్ లాంటి ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీగా నటించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా. ఫీనిక్స్ లాగా ఎదగండి అని శ్రీకాంత్ జీవితం చెబుతోంది , శ్రీకాంత్ పాత్రలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను, అని ఆయన పేర్కొన్నారు.

    ఇక మరోవైపు చిత్ర నిర్మాత నిధి పర్మార్ హీరానందాని, దర్శకుడు తుషార్ హీరానందని మాట్లాడుతూ.. ''ఈ కథ విన్న వెంటనే ఈ స్ఫూర్తిదాయకమైన కథను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నాం, సినిమా కంటే మెరుగైన మాధ్యమం ఏదైనా ఉంటుందా? అంటే అది లేదని చెప్పాలి అందుకే సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు. రాజ్‌కుమార్ రావు మరియు భూషణ్ కుమార్ వంటి పవర్‌హౌస్‌లతో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని మేము ఆశిస్తున్నాము." అని అన్నారు.

    English summary
    Rajkummar Rao to star in visually impaired industrialist Srikanth Bolla’s biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X