»   » కండోమ్ లొల్లి: నీకు ఎయిడ్స్ వస్తుందంటూ మరో నటిపై రాఖీ కామెంట్!

కండోమ్ లొల్లి: నీకు ఎయిడ్స్ వస్తుందంటూ మరో నటిపై రాఖీ కామెంట్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ వ్యవహారం మరోసారి బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. టెలివిజన్ నటి మహికా శర్మను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీశాయి. మహారాష్ట్రలో ప్లాస్టిక్ వాడకంపై బ్యాన్ విధించిన నేపథ్యంలో రాఖీ ప్రమోట్ చేస్తున్న బిబోయ్ కండోమ్స్‌ కూడా బ్యాన్ చేస్తారా? అంటూ మహికా శర్మ కామెంట్స్ చేయడం, దానికి ఆగ్రహంతో ఊగిపోయిన రాఖీ ఆమెను ఉద్దేశించి.. కండోమ్ బ్యాన్ చేస్తే నీకు ఎయిడ్స్ వస్తుంది అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ గొడవ మరింత ముదిరింది.

  రాఖీని కెలికిన మహికా

  రాఖీని కెలికిన మహికా

  ఈ వివాదం మొదలు కావడానికి కారణం మహికా శర్మ అని చెప్పక తప్పదు. మహారాష్ట్రలో ప్లాస్టిక్ మీద బ్యాన్ నేపథ్యంలో.... రాఖీ ప్రమోట్ చేస్తున్న బిబోయ్ కండోమ్ యాడ్‌కు సంబంధించిన ఫోటోను మహికా పోస్ట్ చేసి... ‘రాకీ సావంత్ అక్కయ్యా... ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా, ఆ లిస్టులో నువ్వు ప్రమోట్ చేస్తున్న కండోమ్స్ కూడా ఉన్నాయా? ' అంటూ కామెంట్ పెట్టింది.

  నీలాంటి వారికి ఎయిడ్స్ వస్తుంది

  నీలాంటి వారికి ఎయిడ్స్ వస్తుంది

  ఆమె కామెంటుతో చిర్రెత్తిపోయిన రాఖీ సావంత్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేసి ‘కండోమ్స్ బ్యాన్ చేస్తే మహికా శర్మ లాంటి వారికి ఎయిడ్స్ వస్తుంది' అంటూ వివాదాస్పద కామెంట్ చేసింది. మరో వీడియోలో కండోమ్స్ ప్లాస్టిక్‌తో తయారు కావని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది రాఖీ.

  గతంలోనూ ఇద్దరి మధ్య గొడవ

  గతంలోనూ ఇద్దరి మధ్య గొడవ

  గతంలోనూ రాఖీ, మహికా మధ్య గొడవ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలకు హిందీ సరిగా పలకడం రాదంటూ అవమానకర రీతిలో ఓ పోస్టు పెట్టింది. మహికా కూడా నార్త్ ఈస్ట్ అమ్మాయి కావడంతో తీవ్రంగా స్పందించింది. వెంటనే రాఖీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

  కండోమ్స్ ప్రమోట్ చేసే ఎత్తుగడా?

  కండోమ్స్ ప్రమోట్ చేసే ఎత్తుగడా?

  అయితే రాఖీ సావంత్, మహికా శర్మ ఇలా గొడవ పడటం వెనక మరో కోణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. బిబోయ్ కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికే ఇద్దరూ ఇలా గొడవ పడ్డారని, ప్రచార ఎత్తుగడలో భాగంగానే వీరు ఇదంతా చేస్తున్నారని టాక్.

  మహికా పబ్లిసిటీ స్టంట్?

  మహికా పబ్లిసిటీ స్టంట్?

  మహికా శర్మ ఈ మధ్య బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్లాస్టిక్ బ్యాన్‌ నేపథ్యంలో కావాలనే కండోమ్ ఇష్యూ రేజ్ చేసి వార్తల్లోకి ఎక్కిందని మరికొందరు ఆరోపిస్తున్నారు.

  English summary
  Yet again these divas are involved in a brawl! Rakhi Sawant takes to her Instagram handle to abuse the television actress Mahika Sharma over an issue with regard to the banning of the condom brand Beboy, that she endorses. The verbal fight between the two got uglier when Rakhi attacked Mahika saying that she would contract AIDS if the condoms were banned. It didn't go well for Mahika being on the receiving end. Though the actresses deleted their respective posts from Instagram, their infamous fight and use of foul language against each other, have broken the internet!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more