అతడితో రకుల్ ప్రీత్ సింగ్ అలా సెట్.. ఫ్యాన్స్‌కు కిరాక్ పుట్టించే న్యూస్‌తో...
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. దక్షిణాదిలో అగ్రతారగా టాప్ హీరోలతో నటించిన ఈ ముద్దుగమ్మ దృష్టంతా ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. వరుస చిత్రాలతో ప్రసుత్తం రకుల్ బిజీబిజీగా మారిపోయింది. అయితే తన తాజాగా చిత్రం సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించింది. ఆ అప్‌డేట్ ఏమిటంటే...

బాలీవుడ్‌లో అరడజన్ సినిమాలతో
ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. గతంలో చేతిలో అర డజనుపైగా దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉండే రకుల్‌కు ఇప్పుడు రెండు, మూడు సినిమాల కంటే ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు కారణం బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ బిజీ కావడమే అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చెక్ సినిమాలో రోల్ గురించి
తెలుగులో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చెక్. ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై రకుల్ వీడియోను రిలీజ్ చేసి.. నా పాత్రకు మంచి స్పందన వస్తున్నది. మౌత్ టాక్‌తో చెక్ మంచి విజయాన్ని సాధించడం ఖాయం అని తాజా వీడియోలో స్పష్టం చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో సర్దార్ కా గ్రాండ్‌సన్
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో యువ హీరో అర్జున్ కపూర్‌తో కలిసి నటించిన సర్దార్ కా గ్రాండ్‌సన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని రకుల్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు అందజేసింది.

భారీ తారాగాణం, బడ్జెట్‌తో సరిహద్దు ప్రేమకథ
సర్దార్ కా గ్రాండ్‌సన్ చిత్రం ఇండియా, పాక్ సరిహద్దులో జరిగే ప్రేమకథగా తెరకెక్కింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, అదితిరావు హైదరీ, నీనా గుప్తా తదితరులు నటించారు. కాశీవి నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, కిషన్ కుమార్, మనీషా అద్వానీ తదితరులు నిర్మిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ రాబోయే సినిమాలు
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. 2022 వరకు కూడా బిజీగా ఉన్నారు. తెలుగులో క్రిష్ జాగర్లమూడితో ఇంకా పేరుపెట్టని చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రంలో కనిపిస్తారు. అలాగే సర్దార్ కా గ్రాండ్ సన్, ఆయాలాన్, ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











