twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ 500 కోట్లు సాధించడం గొప్పనా? పఠాన్‌ కలెక్షన్లపై రాంగోపాల్ వర్మ సెటైర్లు

    |

    హిందీ సినీ పరిశ్రమలో కలెక్షన్ల సంచలనాలు సృష్టించిన చిత్రం పఠాన్. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాలను, సినీ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 500 కోట్లు రాబట్టింది. హిందీ సినిమా పరిశ్రమలో తిరుగులేని వసూళ్లను రాబట్టడం రికార్డుగా మారింది.

    Ram Gopal Varma Comments on Shah Rukh Khans Pathaan box office collections

    పఠాన్ క్రియేట్ చేస్తున్న రికార్డులు, వసూళ్లపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. ముక్కు ముఖం తెలియని హీరో యష్ తాను నటించిన కేజీఎఫ్2 సినిమా ద్వారా 500 కోట్లు సాధిస్తే.. బాలీవు్ బాద్షా, సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తన సినిమా పఠాన్‌తో 500 కోట్లు సాధించడం గొప్పేమీ కాదు.
    షారుక్ ఖాన్ సాధించిన గొప్ప డీల్ కాదని అన్నారు.

    యష్ కంటే స్టార్ హీరో షారుక్ ఖాన్. అయితే యష్ 500 కోట్లు సాధించినప్పుడు... కంతార సినిమా బిగ్ హిట్ అయినప్పుడు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీగా బిజినెస్ చేసినప్పుడు. షారుక్ ఖాన్ లాంటి హీరో 500 సాధించడం గొప్ప ఫీట్‌గా భావించడం లేదు అంటూ అన్నారు.

    అంతేకాకుండా షారుక్ ఖాన్‌పై అనేక విమర్శలు చేసిన కొందరిపై వర్మ సెటైర్లు వేశారు. ఓటీటీ బలంగా ఉన్న సమయంలో థియేటర్లలో కలెక్షన్లు రాబట్టడం కష్టం. షారుక్ ఖాన్ పని అయిపోయింది. దక్షిణాది దర్శకులు తీసే మసాలా సినిమాలతో బాలీవుడ్ కమర్షియల్ బ్లాక్ బ్లస్టర్స్ సాధించలేవు. కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లను అధిగమించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చేసిన కామెంట్లు అన్నీ ఓ భ్రమగా మారాయి. ఆ భ్రమలను పఠాన్ సినిమా తొలగించింది అని షారుక్ ఖాన్‌పై వర్మ ప్రశంసలు గుప్పించారు.

    English summary
    Ram Gopal Varma Comments on Shah Rukh Khan's Pathaan box office collections. He said, Bollywood can never make a COMMERCIAL BLOCKBUSTER like the south masala directors It will take years to break the day 1 collections of KGF 2. ALL above MYTHS broken by PATHAN
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X