»   » సెన్సేషనల్ మూవీ కోసం.. రానా 20 రోజులు అడవుల్లోనే.. తెలుగు టైటిల్ ఇదే!

సెన్సేషనల్ మూవీ కోసం.. రానా 20 రోజులు అడవుల్లోనే.. తెలుగు టైటిల్ ఇదే!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rana Daggubati Haathi Mere Saathi Movie Name Confirmed In Telugu,Tamil

  బాహుబలి‌తో సూపర్ సక్సెస్‌ను అందుకొన్న రానా దగ్గుబాటి వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకొంటున్నారు. బాలీవుడ్‌లో హాథీ మేరే సాథీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రను రానా పోషిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు, తమిళ టైటిల్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

  తెలుగు, తమిళ టైటిల్స్ ఇవే

  తెలుగు, తమిళ టైటిల్స్ ఇవే

  హిందీ సూపర్‌స్టార్, స్వర్గీయ రాజేష్ ఖన్నా నటించిన హాథీ మేరే సాథీ సినిమా టైటిల్‌‌తో రానా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో కాదన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

  బరువు తగ్గిన రానా

  బరువు తగ్గిన రానా

  హాథీ మేరే సాథీ చిత్రంలో రానా మావటిగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం చాలా బరువు తగ్గానని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ చిత్రం వన్యప్రాణి సంరక్షణ కథాశంగా రూపొందున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో ఏనుగులది కీలకపాత్ర అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

  15 రోజులు 18 ఏనుగుల మధ్య

  15 రోజులు 18 ఏనుగుల మధ్య

  అరణ్య చిత్రంలోని పాత్ర కోసం రానా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దాదాపు 15 రోజులపాటు సుమారు 18 ఏనుగుల మధ్య గడిపాడు. ఏనుగులను మచ్చిక చేసుకొనేందుకు విపరీతంగా శ్రమించారని చిత్ర యూనిట్ పేర్కొన్నది. దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాల సమస్యలెత్తే అవకాశం ఉన్నందున ఈ చిత్ర షూటింగ్‌ను దాదాపు థాయ్‌లాండ్‌లో జరిపారు.

  సినిమా కోసం ప్రత్యేక శిక్షణ

  సినిమా కోసం ప్రత్యేక శిక్షణ

  అరణ్య సినిమా షూటింగ్ కోసం సుమారు 20 రోజులు అడవుల్లో గడిపాను. రెండు సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. చాలా శిక్షణా శిబిరాలు నిర్వహించాం. చాలా కష్టపడి సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం అని రానా ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

   నటీనటులు వీరే

  నటీనటులు వీరే

  హాథీ మేరే సాథీ చిత్ర టైటిల్స్ గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఎరోస్ రూపొందిస్తున్న హాథీ మేరే సాథీ చిత్రానికి సంబంధించిన తమిళ టైటిల్‌ను కాదన్‌గా, తెలుగు టైటిల్‌ను అరణ్యగా నిర్ణయించారు. రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్, కల్కి కన్మణి, పుక్రిత్ సామ్రాట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్‌లో ముఖ్యమైన పాత్రలో విష్ణు విశాల్ కనిపిస్తారు అని ట్వీట్ చేశారు.

  English summary
  Rana Daggubati starrer Haathi Mere Saathi, directed by Prabhu Solomon, will be released in Hindi,Tamil and Telugu. The makers have now revealed the titles of the Tamil and Telugu version as Kaadan and Aranya respectively. The film has Vishnu Vishaal playing a pivotal role in Tamil and Telugu, while the Hindi version of the film will see Pulkrit Samrat play the role. Female actors Zoya Hussain and Kalki Koechlin will be seen in all three versions of the film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more