Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Animal: భయంకరమైన లుక్ లో రణ్బీర్ కపూర్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ నెక్స్ట్ సినిమా వచ్చేది అప్పుడే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక మళ్లీ అదే కథను హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఆ తర్వాత అతను మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడంతో మళ్లీ అతను బాలీవుడ్ హీరో తోనే సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు.
ఇక మొత్తానికి ఎనిమల్ అనే సినిమాతో రణబీర్ కపూర్ ను ఈ దర్శకుడు సరి కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ హీరో డిఫరెంట్ కిల్లర్ గా సినిమాలో కనిపించబోతున్నట్లు ఇటీవల లీక్ అయిన కొన్ని ఫోటోలతోనే అర్థమైంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వైల్డ్ ఫోటోను కూడా విడుదల చేశారు. అందులో గొడ్డలి పట్టుకుని మరో వైపై సిగరెట్ కాలుస్తూ ఉన్న రణబీర్ కపూర్ ఒంటినిండా గాయాలతో రక్తంతో భయంకరంగా కనిపిస్తున్నాడు.

చూస్తూ ఉంటే సినిమాలో అతను విలన్స్ ను ఊచకోత కోసినట్లుగా అనిపిస్తోంది. దర్శకుడు సందీప్ ఈ సినిమాను డిఫరెంట్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో దర్శకుడు మొత్తానికి అఫీషియల్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అనిమల్ సినిమాను 2023 ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ గా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇంతకుముందు బ్రహ్మాస్త్ర 1 సినిమాతో ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా బాగానే క్రేజ్ అందుకున్న రణబీర్ ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.