Just In
Don't Miss!
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై రచ్చ.. అలియాభట్‌కు ఎలా ఇస్తారు..? కరణ్ జోహర్ పరువు తీసిన కంగనా సోదరి
కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినీ పెద్దలను ఎదురిస్తూ నిలబడుతున్నారు కంగనా రనౌత్, రంగోలి చందేల్. ఎవరిని లెక్క చేయకుండా నెపోటిజం, వారసత్వం, మూవీ మాఫియా గురించి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. తాజాగా మరో సారి ఫిల్మ్‌ఫేర్ అవార్డులపైన రంగోలీ మండి పడింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

గల్లీబాయ్‌కు 13 అవార్డ్‌లు..
బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ‘గల్లీ బాయ్' సినిమా ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, చిత్రం, సహాయ నటుడు, సహాయ నటి, మ్యూజిక్ ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా పదమూడు క్యాటగిరీల్లో గల్లీబాయ్ సత్తా చాటింది.

అలియాకు అవార్డు రావడంపై..
అలియా భట్‌కు ఉత్తమ నటిగా అవార్డును ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలియా భట్ మంచి నటి, ప్రస్తుత కాలంలో రైజింగ్ స్టార్, గొప్ప ప్రతిభ కనబరుస్తుందని అందరికీ తెలుసు అయితే గల్లీ బాయ్ చిత్రంలో ఆమె చేసిందేమిటి? జ్యూరీ సభ్యులు ఎవరైనా గల్లీబాయ్ సినిమాను చూశారా? ఆమెకు ఎలా ఇస్తారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలా ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. మీరే కాదు అలియా భట్ ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటున్నారంటూ రంగోలి కౌంటర్ వేసింది.
|
కరణ్ జోహర్‌పై తీవ్ర విమర్శలు..
ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఫేక్ అని మరోసారి నిరూపితమైందని, మూవీ మాఫియా అనేది ఉందని బట్టబయలైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జ్యూరీ సభ్యుడిగా కరణ్ జోహర్ వంటి వారు ఉంటే నిజమైన ప్రతిభావంతులకు అవార్డులు ఎలా వస్తాయంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కాకముందే అవార్డులా..?
ఫిల్మ్ ఫేర్ అవార్డులపై రంగోలీ స్పందిస్తూ... తఖ్త్ సినిమాలోని నటీనటులందరికీ అవార్డులు ఇచ్చుకున్నావ్.. సినిమా రిలీజ్ కాకముందే అవార్డులు ఇచ్చుకున్నావా? అంటూ కరణ్ జోహర్ పరువు తీసేసింది. మణికర్ణిక చిత్రానికి గానూ కంగనాకు అవార్డు రావాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనన్య పాండేకు డెబ్యూ హీరోయిన్ అవార్డు ఇవ్వడంపైనా పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఫిల్మ్ ఫేర్ అవార్డులు మళ్లీ పెద్ద చర్చను లేవనెత్తింది.