For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు వేధింపులు తప్పలేదు.. ఛాన్స్ దొరికితే.. హీరోల భార్యలు, లవర్స్‌ కారణం.. రవీనా

  |

  బాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం జోరుగా సాగుతున్నది. లైంగిక వేధింపుల ఆరోపణలకు గురైన బాధితులకు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో వేధింపుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తాజాగా లైంగిక వేధింపులుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్పందించారు. మహిళలను వేధిస్తున్న ఘటనలు తనను ఆగ్రహానికి గురిచేస్తున్నాయని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

  నా కళ్ల ముందే నీచంగా.. వైరముత్తుపై మరో లైంగిక పిడుగు.. గాయకుడి భార్య..

  వేధింపుల బారిన పడ్డాను

  వేధింపుల బారిన పడ్డాను

  లైంగిక వేధింపులకు గురి కాలేదు. కానీ ప్రొఫెషనల్ వేధింపుల బారిన పడ్డాను. ఆ కారణంగా కొన్ని సినిమాలు చేజారాయి. కొందరు మహిళా జర్నలిస్టులే తమ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లలో ప్రతిష్టను దిగజార్చే విధంగా రాతలు రాశారు. నా గురించి అవాస్తవాలు రాసి హీరోలకు లబ్ది చేకూర్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

  దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో నేను ఎప్పుడూ లైంగిక వేధింపులకు

  దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో నేను ఎప్పుడూ లైంగిక వేధింపులకు

  గురికాలేదు. ఎందుకంటే నేను వాటిని సహించను. ఎవరైనా నాతో దారుణంగా బిహేవ్ చేస్తే వాటికి ధీటుగా సమాధానం ఇస్తాను. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుచుకొంటూనే గుండె బరువెక్కుతున్నది. అలాంటి వ్యథతో కూడిన కథనాలు వింటే గుండె తరుక్కుపోతున్నదని రవీనా టాండన్ పేర్కొన్నారు.

  జీవితాలను నాశనం చేయడానికి

  జీవితాలను నాశనం చేయడానికి

  సినీ పరిశ్రమలో హీరోయిన్ల జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు కంకణం కట్టుకొంటారు. ఛాన్స్ దొరికితే పరువు ప్రతిష్టలను గంగలో కలుపుతారు. అందులో కొన్నిసార్లు మరో మహిళ లైఫ్‌ను చెడగొట్టేందుకు మహిళలే పావులు కదుపుతారు. అభద్రతాభావం, జెలసీ లాంటి అంశాలు కారణమవుతాయి అని రవీనా టాండన్ తెలిపారు.

  హీరోల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కారణం

  హీరోల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కారణం

  హీరోయిన్ల జాతకాలను మార్చే వారిలో హీరోల భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ కీలక పాత్రను పోషిస్తారు. వారు చాలా సైలెంట్‌గా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతారు. తమ భార్తలను కాపాడుకోవడానికి హీరోయిన్ల జీవితాలను పణంగా పెడుతారు. ఓ హీరోయిన్‌ను మార్పు చేసి మరో హీరోయిన్‌ను రంగంపైకి తెస్తారు అని రవీనా టాండన్ సంచలన విషయాలను బయటపెట్టారు.

  ప్రొఫెషనల్ వేధింపులే దారుణం

  ప్రొఫెషనల్ వేధింపులే దారుణం

  లైంగిక వేధింపులే కాదు ప్రొఫెషనల్ వేధింపులు చాలా దారుణంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, మనం చేసుకొనే కాంట్రాక్టులు చాలా బలంగా ఉండాలి. హీరోయిన్లతో పనిచేయడానికి ఏమైన ఇబ్బందులు ఉంటే ఎవరైనా వారికి దూరంగా ఉండాలి. కానీ అమ్మాయిల జీవితాలను నాశనం చేయకూడదు అని రవీనా టాండన్ అన్నారు.

  English summary
  Actress Raveena Tandon said she has been through 'professional harassment' in the film industry and hence understands the trauma. "I was never sexually harassed as I was not the one to just take it. I would give it back. But I can imagine the trauma that the young girls go through. It is so sad and disheartening to hear these stories. It angers me," Raveena told PTI.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X