వేషాల కోసం శరీరాన్ని అమ్ముకోవద్దు.. క్యాస్టింగ్ కౌచ్‌పై రవికిషన్

By Rajababu

Recommended Video

Actor Ravi Kishan Makes Serious Comments On Film Industry

సినీ పరిశ్రమలో లైంగిక దాడులు కేవలం ఆడవాళ్లకే పరిమితం కాదని, మగవాళ్లపై కూడా ఉంటాయని ప్రముఖ నటుడు రవి కిషన్ వెల్లడించారు. అయితే వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆయన అన్నారు. అలాంటి వాటిని పట్టించుకొంటే కెరీర్‌ తీవ్ర ఇబ్బందిలో పడుతుందని ఆయన అన్నారు. వేషాల కోసం పడకగదికి వెళ్లే అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

 వేధింపులు సాధారణం

వేధింపులు సాధారణం

సినీ రంగంలో లైంగిక వేధింపులు తప్పక ఉంటాయి. వేషాల కోసం అమ్మాయిలను పడక గదిలో రమ్మనే సంస్కృతి ఉంది. ఇది ఈ రంగానికే పరిమితం కాదు అని రవి కిషన్ అన్నారు. ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన రవి కిషన్‌ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.

క్యాస్టింగ్ కౌచ్ ఆటలో భాగం

క్యాస్టింగ్ కౌచ్ ఆటలో భాగం

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ భాగం. ఇది ఓ ఆటలాంటింది. ఇలాంటి పరిస్థితుల్లో పడకుండా ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మెదులుకోవాలి. ఇలాంటి ముప్పు నుంచి ప్రతీ ఒక్కరు తమను తాము కాపాడుకోవాలి అని రవి కిషన్ అన్నారు.

పక్కలో పడుకొంటే

పక్కలో పడుకొంటే

సినీ పరిశ్రమలో ఇలాంటి చర్యలపై వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకరి పక్కలో పడుకొని వేషాలు సంపాదిస్తే జీవితంలో ముందుకు వెళ్లలేవు. అలాంటి పనులు చేస్తే భవిష్యత్ ఉండదు. మనల్ని మనం అమ్ముకుంటే కెరీర్‌లో పురోగతి ఉండదు అని రవి కిషన్ పేర్కొన్నారు.

 మానసికంగా పతనం

మానసికంగా పతనం

అవకాశాల కోసం దిగజారితే పరిశ్రమలో గుర్తింపు ఉండదు. మానసికంగా నీకు నీవు పతనం అవుతావు. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రతీ క్షణం మనం సాధించిన విషయాలను బేరీజు వేసుకోవాలి అని రవి కిషన్ సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X