»   » నిమ్రత్ కౌర్‌తో డేటింగ్: చిరాకుపడిన రవిశాస్త్రి.. ఎలా జవాబిచ్చారంటే..

నిమ్రత్ కౌర్‌తో డేటింగ్: చిరాకుపడిన రవిశాస్త్రి.. ఎలా జవాబిచ్చారంటే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ravi Shastri Responds On Affair With Nimrat Kaur

  బాలీవుడ్ హీరోయిన్‌ నిమ్రత్ కౌర్‌తో ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నారనే వార్త సినీ, క్రీడా రంగంలో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఇండియన్ టీమ్‌లో ప్లేబాయ్ అని చెప్పుకొనే రవిశాస్త్రిపై ఇలాంటి వార్తలు ఈ మధ్యలో రాలేదు. సడెన్‌గా రవిశాస్త్రి వ్యక్తిగత జీవితం మీడియాలో రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. రవిశాస్త్రి వ్యవహారంపై అందాల తార నిమ్రత్ సోమవారం ఓ క్లారిటీ ఇచ్చేసింది. అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. చాలా సీరియస్‌గా స్పందించారు.

   డేటింగ్ వార్తపై రవిశాస్త్రి సీరియస్

  డేటింగ్ వార్తపై రవిశాస్త్రి సీరియస్

  నిమ్రత్‌తో డేటింగ్ వ్యవహారంపై రవిశాస్త్రి ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. నాపై వస్తున్న రూమర్‌పై మాట్లాడానికి ఏమీ లేదు. నాపై రాసిన వార్త ఓ భారీ పేడకుప్ప, చెత్త లాంటింది అని సీరియస్ అయ్యారు. అయితే పదేపదే ఈ విషయంపై సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయగా.. చెప్పనుగా.. అది ఓ చెత్త వార్త అని రవిశాస్త్రి దురుసుగా సమాధానం ఇచ్చారు.

  అదొక చెత్త వార్త

  అదొక చెత్త వార్త

  అయితే రవిశాస్త్రి నుంచి ఎలాగైనా సమాధానం రాబట్టాలని విలేకరి ప్రయత్నించారు. మీరు ఎప్పుడు నిమ్రత్‌ను కలుసుకొన్నారు అని మరో ప్రశ్నగా అడగడంతో రవిశాస్త్రి చిరాకు పడ్డారు. ఆమెతో డేటింగ్ వార్త ఓ చెత్త వార్తని చెప్పాను. మీరు ఇక అర్ధం చేసుకోవాలి అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

   రవిశాస్త్రితో అఫైర్‌పై నిమ్రత్

  రవిశాస్త్రితో అఫైర్‌పై నిమ్రత్

  రవిశాస్త్రి డేటింగ్ వ్యవహారంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన నిమ్రత్ కౌర్ స్పందించారు. రవిశాస్త్రితో అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలన్నీ కల్పితాలే. మూలాల్లోకి నిజాలను అన్వేషించాలి. అయితే నా గురించి రాస్తున్న కల్పితాలను చదివాను. కల్పిత వార్తలు నన్ను బాధించాయి. వారాంతం తర్వాత సోమవారం ఉండే హ్యాంగోవర్ ఇంకా దిగలేదనిపిస్తున్నది. అవన్నీ కొట్టేసి సంతోషంగా గడిపేందుకు రెడీ అయ్యాను అని నిమ్రత్ నర్మగర్భంగా ట్వీట్ చేసింది.

  రవిశాస్త్రి, అమృత అఫైర్ గురించి

  రవిశాస్త్రి, అమృత అఫైర్ గురించి

  ఇండియన్ క్రికెట్ టీమ్‌కు 80వ దశకంలో రవిశాస్త్రి ఆడేటప్పుడు బాలీవుడ్ హీరోయిన్, సైఫ్ ఆలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్‌తో అఫైర్ నడిచింది. దాదాపు పెళ్లి పీటల వరకు వచ్చిన వారి అఫైర్ ఆ తర్వాత అర్ధాంతరంగా ముగిసింది.

  English summary
  Nimrat Kaur responds to rumours of dating Ravi Shastri, She tweeted that news of dating with Ravi Shastri is "fiction." She wrote on Twitter, Fiction can be more hurtful, Monday blues exist and I love ice cream. Here's to trash free happy days ahead. Ravi Shastri Said that "Nothing to say when it is the biggest load of cow dung,"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more