For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన సుఖమే కోరుకొంటున్నా.. కాపురంలో చిచ్చు పెట్టను.. రేఖ

|

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, రేఖ జంటకు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆన్ స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ ఎంత వర్కవుట్ అయిందో.. ఆఫ్ స్క్రీన్‌లో వారి అఫైర్ ఎన్నో వివాదాలకు, సంచలన కథనాలకు మూలంగా మారింది. కొద్దిరోజుల క్రితం రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. అమితాబ్‌పై ఉన్న ప్రేమను, మనసులో ఉన్న భావాలను బయటకు వెల్లడించింది. అమితాబ్ గురించి రేఖ ఏం చెప్పారంటే...

అమితాబ్‌తో నాది గొప్ప అనుబంధం

అమితాబ్ బచ్చన్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయనను గొప్పగా, పూర్తిగా, డెస్పెరేట్‌గా, స్వార్ధం లేకుండా నా మాదిరిగా ప్రేమించిన మరో వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు. అమితాబ్‌పై ఉన్న ప్రేమ కాదు. దానికంటే చాలా ఎక్కువ. ప్రేమ, ఆరాధ్యం లాంటి పదాలు ఆయనతో నా రిలేషన్‌కు సరితూగవు అని రేఖ అన్నారు.

ఆ వివాహం నాపై ఎలాంటి ఎఫెక్ట్

అమితాబ్ వివాహం చేసుకోవడం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. అలాంటి ఎఫెక్ట్ నాపై పడలేదు. ఎప్పటికైనా అతడు నా వాడే అనే ఫీలింగ్ నా మదిలో ఉంటుంది. అందుకే అతను నాకు దూరమైనా అలాంటి ఫీలింగ్ నాకు కలగడం లేదు అని రేఖ అన్నారు.

నా రిలేషన్‌ బిగ్‌బీకి గౌరవం తెచ్చేలా

తనతో అనుబంధం ఆయనకు గౌరవం తెచ్చేలా ఉండాలని నేను కోరుకొంటాను. అందుకే ఏ శక్తి కూడా అతడికి దూరం చేయలేకపోయింది. ఆయనకంటూ ఓ జీవితం ఉంది. ఆ ఇంటిని నేను ఎందుకు ముక్కలు చేయాలి. అలా చేస్తే నాకు ఏం ఒరుగుతుంది. నా వల్ల ఎలాంటి ఇబ్బందుల లేకుండా అతను (అమితాబ్) హ్యాపీగా ఉండాలని కోరుకొంటాను అని రేఖ చెప్పారు.

చిరునవ్వుతో ఓ నమస్తే అని

మా మధ్య రిలేషన్ చాలా నార్మల్‌గా ఉంటాయి. ఎన్నో వేడుకల్లో, ఫంక్షన్లలో అమితాబ్‌ను కలుసుకొంటాను. అతను ఓ అద్బుతమైన వ్యక్తి. అతని జాపకశక్తి చాలా గొప్పది. మేమిద్దరం కలుసుకొన్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వి నమస్తే అని పలకరించుకొంటాం. దానికంటే మించినది ఏమున్నది అని రేఖ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

మళ్లీ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా?

బాలీవుడ్‌లో మా జంటకు మంచి ప్రేక్షకాదరణ 1981 వరకు దక్కింది. సిల్ సిలా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా రిలేషన్‌కు సంబంధించిన అనేక వివాదాలు మీడియాలో వచ్చిన తర్వాత మేమే కలిసి నటించొద్దని అనుకొన్నాం. కొన్ని పరిస్థితుల తర్వాత పూర్వపు కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా అనే అంశంపై ఎన్నో అనుమానాలు ఉండేవి.

అమితాబ్ హ్యాపీగా ఉండాలి.. అంతే

అమితాబ్ పెళ్లి తర్వాత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. పిల్లలు, మనవలు, మనువరాండ్లతో హ్యాపీగా ఉన్నారు. ఆయన కెరీర్ కూడా అద్భుతంగా సాగుతున్నది. ఇప్పుడు మళ్లీ కలిసి నటించి అతడికి దగ్గర కావడం ఇష్టం లేదు. అయితే మేమిద్దరం కలిసి నటిస్తే తెరపైన అద్భుతమైన జంటగా పేరు రావడం గ్యారెంటి అని రేఖ అభిప్రాయపడ్డారు.

English summary
Rekha and Amitabh Bachchan had a rock-solid affair in the 70's but Amitabh never accepted the same. However, Rekha was very vocal about their relationship. The veteran actress had openly accepted her feeling for Amitabh on a chat show hosted by her close friend Simi Grewal in 2004.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more