Don't Miss!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- News
ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన రష్యా..!!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఏకధాటిగా 5 నిమిషాలు లిప్‌లాక్.. డైరెక్టర్ కుట్రతో రేఖకు చేదు అనుభవం!
వెండితెరపైన వెలిగిపోయే ఏ స్టార్ హీరోయిన్‌కైనా కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాలు తప్పవనేది కాదనలేని వాస్తవం. ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థానానికి ఎదిగిన ఏ హీరోయిన్‌నైనా కదిలిస్తే.. తాము నడిచి వచ్చింది పూలబాట కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. ఇలా ఎందరో తారామణులు తమ జీవితంలోని చీకటి కోణాలను కొన్నిసార్లు పంచుకొంటారు. తాజాగా ఐదు దశాబ్దాలకుపైగా బాలీవుడ్‌లో రారాణిలా ఎదుగుతున్న రేఖ కెరీర్ జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయనేది తాజాగా బయటకు వచ్చాయి.

రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరి పుస్తకంలో
ఇటీవల రేఖ జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని రాసిన రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరి అనే పుస్తకంలో యాసిర్ ఉస్మాన్ అనే రచయిత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అంజనా సఫర్ అనే చిత్రం షూటింగ్ జరిగే సమయానికి రేఖకు 15 ఏళ్లు. ఆ సమయంలో బిస్వజీత్ అనే హీరోతో కొన్ని రొమాంటిక్ సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో ఆమెకు చెప్పకుండా ఓ సుదీర్ఘమైన లిప్‌లాక్‌ను తీశారు అనే విషయాన్ని తన పుస్తకంలో పొందుపరిచారు.

అంజనా సఫర్ చిత్రంలో
బాంబేలోని మహబూబ్ స్టూడియోలో అంజనా సఫర్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకు రాజా నవాతే అనే వ్యక్తి దర్శకత్వం, సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వహించారు. ఆ సినిమా తొలి షెడ్యూల్‌లోనే బిస్వజిత్, రేఖ మధ్య గాఢమైన ముద్దు సీన్‌కు ప్లాన్ చేశారు. రేఖకు ఆ విషయాన్ని చివరి నిమిషం వరకు చెప్పకుండా ఆమెను ఇబ్బందికి గురిచేశారు అని యాసిర్ ఉస్మాన్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

ఐదు నిమిషాలపాటు కిస్ సీన్
షూటింగ్ సందర్భంగా బిస్వజీత్, రేఖను సెట్లోలోకి తీసుకెళ్లారు. రాజా నవాతే యాక్షన్ చెప్పారు. వెంటనే రేఖను బిస్వజీత్ తన కౌగిలిలోకి తీసుకొని పెదాలపై పెదాలు పెట్టాడు. ఇలాంటి సీన్ ఉంటుందని తెలియకపోవడంతో రేఖ బిత్తరపోయింది. కెమెరా అలా రోల్ అవుతూనే ఉంది. డైరెక్టర్ కట్ చెప్పకపోవడంతో బిస్వజిత్ ముద్దు సీన్‌లోనే ఉండిపోయాడు. దాదాపు 5 నిమిషాల తర్వాత డైరెక్టర్ కట్ చెప్పాడు. దాంతో రేఖ ఊపిరి పీల్చుకొన్నది అని యాసిర్ ఆ సీన్ గురించి విపులంగా రాశారు.
Recommended Video

కంటతడి పెట్టిన రేఖ
డైరెక్టర్ రాజా కట్ చెప్పగానే చిత్ర యూనిట్ అంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. రేఖ పరిస్థితి మరీ దారుణంగా మారింది. రేఖ కన్నీటి పర్యంతమైంది. ఆమె పరిస్థితిని ఎవరూ పట్టించుకోకపోగా.. సీన్ బాగా వచ్చిందని ఆనందపడిపోయారు. తర్వాత ఆ సీన్ గురించి హీరో బిస్వజిత్ మాట్లాడుతూ.. ఆ ప్లాన్ అంతా డైరెక్టర్‌దే. కేవలం నేను ఆయన సూచనలు పాటించాను. నా సంతోషం కోసం కాదు.. ఆ సీన్ సినిమాకు చాలా కీలకం అని అన్నారు. కానీ రేఖకు మాత్రం తన జీవితంలో ఓ చేదు అనుభవంగా మారిందనే విషయాన్ని రచయిత యాసిర్ స్పష్టం చేశారు.