twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ అమావాస్య ట్వీట్.. నాన్సెన్స్ అంటూ దారుణంగా నెటిజన్ల కామెంట్లు

    |

    దేశంలోనే సినీ దిగ్గజం బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో పోస్టులతో కూడా జోరును కొనసాగిస్తుంటారు. ఏదైనా కష్టకాలం వస్తే దానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం, తన అభిప్రాయాలను చెప్పడం, ప్రజల్లో, అభిమానుల్లో సానుకూలత పెంచడం చేస్తుంటారు. తాజాగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమితాబ్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌పై నెటిజన్ల కొందరు విరుచుకుపడ్డారు. ఇంతకు అమితాబ్ చేసిన ట్వీట్ ఏమిటంటే..

    జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన

    జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన

    ఆదివారం జనతా కర్ఫ్ప్యూ విధించిన రోజున సాయంత్రం 5 గంటల సమయంలో కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఇతర విభాగాల సేవకులకు సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలని, ప్లేట్స్‌తో చప్పుడు చేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

    అమావాస్య రోజు దుష్టశక్తులు

    అమావాస్య రోజు దుష్టశక్తులు

    ప్రధాని మోదీ చప్పట్ల కార్యక్రమం నేపథ్యంలో అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 22 మార్చి అమావాస్య, ఈ నెలలోనే అత్యంత చీకటి రోజు. వైరస్, బ్యాక్టీరియా, దుష్టశక్తులు ఈ రోజు శక్తిమంతంగా ఉంటాయి. కాబట్టి చప్పట్లు, శంఖునాదం వల్ల వచ్చే ప్రకంపనలు వైరస్‌ శక్తిని నాశనం చేస్తాయి. అలాగే రేవతి అనే నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. కొన్ని ప్రకంపనలు దేహంలోని రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అని ట్వీట్‌లో అమితాబ్ పేర్కొన్నారు.

    అర్థంలేని ట్వీట్లు శుద్ధ దండగ

    అర్థంలేని ట్వీట్లు శుద్ధ దండగ

    మీలాంటి వాళ్లు ఇలాంటి ట్వీట్ల చేయడానికి బదులు.. మెడికల్ స్టాఫ్‌లో స్ఫూర్తిని నింపడం, ఆరోగ్య పరంగా మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం, బడ్జెట్ పెంచే విధంగా చర్యలు తీసుకోవడం చేయాలి. ఇలాంటి అర్ధంలేని ట్వీట్లు శుద్ధ దండగ.. ఐటీ, ఈడీ దాడుల గురించి భయపడి ఇలా చేసి ఉంటారేమో అని ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ చేశారు.

     మూఢ నమ్మకాలు నమ్మే విధంగా

    మూఢ నమ్మకాలు నమ్మే విధంగా

    ఇంకా ఈ కాలంలో మూఢ నమ్మకాలను నమ్మడం ఏమిటి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. మీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మే విధంగా కామెంట్లు రావడం సిగ్గుచేటు. ఇలాంటి అర్ధంపర్థం లేని సలహాలు, సూచనలు సెలబ్రిటీల నుంచి రావడం ప్రమాదకరం. ఇలాంటి ట్వీట్ల వల్ల భారతీయ జీవితాలు ప్రమాదంలో పడుతాయి. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him
    ప్రతికూలత, సానుకూలత

    ప్రతికూలత, సానుకూలత

    నెటిజన్ల నుంచి ప్రతికూల కామెంట్లు రావడంతో అమితాబ్ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే కొందరు దానిని బూచీగా చూపిస్తూ బిగ్‌బీ ఒత్తిడి పెంచాలి. ఇలాంటి నాన్సెన్స్‌ను అరికట్టాలని కొందరు.. అంటే.. మరికొందరు ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేశారు. మాకు ఎంతో సమాచారాన్ని ఇచ్చింది అంటూ ట్వీట్లు చేయడం గమనార్హం.

    English summary
    Bollywood superstar Amitabh Bachchan tweet on Coronavirus goes boomerang. He tweeted that "An opinion given: 5pm, 22nd March, "Amavasya," darkest day of month; virus, bacteria, evil force at max potential and power! Clapping, shankh vibrations reduce/destroy virus potency. Moon passing to new 'nakshatra' Revati. Cumulative vibration betters blood circulation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X