Just In
- 10 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 32 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్.. కలిసున్న ఫొటోను లీక్ చేసి హాట్ టాపిక్ అయింది.!
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హిందీ సినీ పరిశ్రమలో ప్రేమల గోల ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో.. హీరోయిన్ల మధ్య డేటింగులు అక్కడ సర్వ సాధారణం. అందుకే బాలీవుడ్‌లోని నటీనటులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఓ యువ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, తాజాగా సదరు నటి చేసిన పోస్టుతో వాళ్ల ప్రేమాయణాన్ని చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆమె ఏం పోస్టు చేసింది.? వివరాల్లోకి వెళితే...

తెలుగు సినిమాతోనే పరిచయం అయింది
పైన పేర్కొన్న హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బడా నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘తూనీగా తూనీగా' అనే సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన రెహా చక్రవర్తి. ఈ సినిమా తర్వాత ఆమె ఇక్కడ కనిపించకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం పలు చిత్రాలు చేసింది. అలాగే, కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసి పాపులర్ అయిపోయింది.

ధోనీతో ప్రేమాయణంతో బాగా ఫేమస్
రెహా చక్రవర్తి బాలీవుడ్‌లో నటించి మంచి పేరు దక్కించుకుంది. అయితే, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం సాగిస్తూ అంతకంటే ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. సుశాంత్ చాలా హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ.. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో నటించడంతో అతడు బాగా క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

రహస్యంగా కలిశారు.. బహిర్గతం చేసేశాడు
గతంలో వీళ్లిద్దరూ చాలా సార్లు రహస్యంగా కలుసుకున్నారు. ముఖ్యంగా గత ఏడాది లండన్‌లో జరిగిన రెహా పుట్టినరోజు వేడుకలను సుశాంత్ దగ్గరుండి చూసుకోవడంతో ఈ ఎఫైర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను' అని వెల్లడించాడు.
ఫాంహౌస్‌లో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు లీక్
కొద్ది రోజుల క్రిందట ఈ జంట ముంబై శివారులోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లింది. అక్కడ జరిగిన వీకెండ్ పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో సుశాంత్ - రెహాతో పాటు వాళ్ల కజిన్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ల వ్యవహారం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్
మంగళవారం సుశాంత్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని రెహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, ‘హ్యాపీ బర్త్ డే మై బ్యూటీఫుల్ సుపర్ మాస్సివ్. బాయ్ విత్ గొల్డేన్ హార్ట్' అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె తన ప్రేమను చెప్పకనే చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు, రెహా పోస్టుకు సుశాంత్ ‘థ్యాంక్యూ మై రాక్‌స్టార్' అని రిప్లై కూడా ఇచ్చాడు.