twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పుగా అనుకోవద్దు.. మద్యం దుకాణాలు తెరవండి.. సీనియర్ నటుడి షాకింగ్ పోస్ట్

    |

    కరోనా ఎఫెక్ట్ కారణంగా యావత్ భారత దేశంలో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశ్రమలతో పాటు అన్ని దుకాణాలను స్వచ్చందంగా బంద్ చేసి కరోనా కట్టడిలో భాగవవుతున్నారు జనం. దేనిసంగతెలా ఉన్నా మద్యం దుకాణాలు తెరవకపోవడంతో మందు బాబులు పరేషాన్ అవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు సీనియర్ నటుడు రిషికపూర్. వివరాల్లోకి పోతే..

    కరోనా కట్టడి.. అదొక్కటే మార్గం

    కరోనా కట్టడి.. అదొక్కటే మార్గం

    రోజురోజుకూ విస్తృతమవుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే సామాజిక దూరం పాటించడమే ఒక్కటే మందు అని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ తర్వాత 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ పలు ఆంక్షలు పెట్టింది భారత ప్రభుత్వం.

     వైన్స్ బంద్.. మందుబాబుల తీరు

    వైన్స్ బంద్.. మందుబాబుల తీరు

    జనతా కర్ఫ్యూ రోజు మూతపడ్డ వైన్స్ (మందు దుకాణాలు) నేటికీ తెరుచుకోలేదు. లాక్‌డౌన్ పూర్తయ్యేదాకా తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో మద్యం దొరకక మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఎక్కడ మద్యం దొరుకుతుందా అని వెతికేపనిలో పడ్డారు. అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్.

    షాకింగ్ పోస్ట్.. ప్రభుత్వానికి రిక్వెస్ట్

    షాకింగ్ పోస్ట్.. ప్రభుత్వానికి రిక్వెస్ట్

    ప్రతిరోజూ సాయంత్రం కొంతసేపైనా మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రిషికపూర్ ట్వీట్ చేశారు. తన విజ్ఞప్తిని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకోవద్దని అని కోరిన ఆయన.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారు అనిశ్చితి, నిరాశలో మునిగి ఉంటారని అన్నారు. ఇలాంటి సమయంలో వారికి మద్యం అవసరం చాలా ఉంటుంది. ఆలోచించండి అని పేర్కొన్నారు రిషికపూర్.

    మద్యం అవసరం ఎంతైనా ఉంది.. బ్లాక్‌లో అయినా!

    మద్యం అవసరం ఎంతైనా ఉంది.. బ్లాక్‌లో అయినా!

    ఈ సమయంలో మద్యం అవసరం ఎంతైనా ఉంది. కనీసం బ్లాక్‌లో అయినా అమ్మితేనే బాగుంటుందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు నెటిజన్లు ఈ ట్వీట్ చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు.

    వెల్లువెత్తుతున్న కామెంట్స్.. హాట్ ఇష్యూ

    రిషికపూర్ అభిప్రాయంతో కొందరు నెటిజన్స్ ఏకీభవిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేఖిస్తున్నారు. ఇలాంటి సమయంలో షాపులు తెరవడం సాహసమే అవుతుందని, మద్యం షాపులు తెరిస్తే జనమంతా రోడ్లెక్కుతారని, తద్వారా లాక్‌డౌన్ ఫెయిల్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో రిషికపూర్ చేసిన ఈ ట్వీట్ హాట్ ఇష్యూగా మారింది.

    English summary
    In India LockDown situation bollywood senior actor Rishi Kapoor request to government to open liquor stores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X